Pension Scheme: అమెరికా లాంటి దేశాల్లో సంపాదించిన డబ్బును వీకెండ్స్‌లో ఖర్చు చేసేయడం అక్కడి సంస్కృతి. అలా చేస్తేనే... దేశం అభివృద్ధి చెందుతుంది అనేది ఒరకమైన ఆర్థిక సూత్రం. మన దేశంలో అందుకు పూర్తి భిన్నం. ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు... ప్రజల డబ్బును పొదువు వైపు మళ్లిస్తాయి. తద్వారా... వయసు పెరిగాక... ఆ పొదుపు డబ్బే వారికి ఆదాయంగా మారుతుందనేది ఓ మంచి ఆలోచన. అందులో భాగమే ఇలాంటి స్కీములు. రిటైర్మెంట్ తర్వాత... ప్రతి నెలా రూ.5,000 పెన్షన్ రావాలంటే... రోజూ రూ.7 పెట్టుబడి పెట్టాలి. అందుకోసం అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana (APY))లో చేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ అటల్ పెన్షన్ యోజనను కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దీని ద్వారా అసంఘటిత రంగం (unorganized sectors) లోని పేదవారు, కూలీలు, శ్రామికులు, కార్మికులు ప్రయోజనం పొందగలరు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు ఈ స్కీములో పెట్టుబడి పెట్టవచ్చు. పెన్షన్ ప్రయోజనాలు పొందవచ్చు. కావాల్సిందల్లా బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ అకౌంట్. (ప్రతీకాత్మక చిత్రం)
రూ.7తో రూ.5,000 పెన్షన్ పొందడం ఎలా?: మీరు 18 ఏళ్ల వయసప్పుడు అటల్ పెన్షన్ యోజన అకౌంట్ తెరిస్తే.... నెలకు రూ.42 చొప్పున చెల్లిస్తూపోవాలి. తద్వారా మీకు 60 ఏళ్లు దాటాక... నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ వస్తూ ఉంటుంది. అదే మీరు నెలకు రూ.84 చెల్లిస్తూపోతే... రిటైర్మెంట్ తర్వాత మీకు నెలకు రూ.2,000 పింఛను వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)