1. మీరు ఏదైనా పొదుపు పథకంలో చేరాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను, పెన్షన్ స్కీమ్స్‌ని అందిస్తోంది. అందులో ఓ పొదుపు పథకంలో (Savings Scheme)రోజుకు రూ.7 పొదుపు చేస్తే ఏటా రూ.60,000 పొందొచ్చు. అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) ద్వారా ఇది సాధ్యం. రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 పొదుపు చేస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
2. రిటైర్మెంట్ వయస్సు నుంచి నెలకు రూ.5,000 చొప్పున ఏటా రూ.60,000 పెన్షన్ లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకాల్లో అటల్ పెన్షన్ యోజన-APY బాగా పాపులర్ అయింది. ఇక ఇటీవల కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరేవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా అండగా ఉండేందుకు పెన్షన్ కోరుకునేవారు ఇప్పటి నుంచే ఈ పథకంలో పొదుపు చేస్తే చాలు. రిటైర్మెంట్ తర్వాత ఫిక్స్డ్ పెన్షన్ వస్తుంది.కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ లాంటి పెన్షన్ స్కీమ్స్‌లో లేని అసంఘటిత రంగ కార్మికుల కోసం రూపొందించిన పథకం ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
4. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరడానికి కనీస వయస్సు 18 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 40 ఏళ్లు. ఎప్పుడు ఈ స్కీమ్‌లో చేరినా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తూ ఉండాలి. ప్రతీ నెల కనీసం రూ.42 నుంచి పొదుపు చేయొచ్చు. గరిష్టంగా రూ.1,454 పొదుపు చేయొచ్చు. ఈ స్కీమ్‌లో కనీస పెన్షన్ రూ.1,000 లభిస్తుంది. గరిష్టంగా నెలకు రూ.5,000 పెన్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)