అయితే బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు మాత్రం పసిడి రేటు తగ్గినప్పుడు అల్లా కొనుగోలు చేయడం ఉత్తమం. ఎందుకంటే బంగారం ధరలు మరింత పైకి చేరితే అప్పుడు జేబు నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆర్థిక మాంద్యం భయాలు కూడా బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో పసిడి రేటు దూకుడు మీద ఉంది.