3. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కొత్త ధరలు డిసెంబర్ 14 నుంచి అమలులోకి వస్తాయి. అంటే డిసెంబర్ 13 అర్ధరాత్రి వరకు ప్రస్తుతం ఉన్న ధరకే సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. ఆ తర్వాత మెంబర్షిప్ తీసుకుంటే మాత్రం పెరిగిన ధరల ప్రకారమే చెల్లించాలి. ఇక రెన్యువల్ చేసేవారు కూడా డిసెంబర్ 13 లోపు చేస్తే పాత ధరలే వర్తిస్తాయి. (image: Amazon India)
4. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వివరాలు చూస్తే ప్రస్తుతం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ధర రూ.999. డిసెంబర్ 14 నుంచి రూ.1,499 చెల్లించాలి. యాన్యువల్ మెంబర్షిప్ ఏకంగా రూ.500 పెరిగింది. యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు మంత్లీ, క్వార్టర్లీ మెంబర్షిప్ ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం మంత్లీ ప్లాన్ ధర రూ.129 కాగా డిసెంబర్ 14 నుంచి రూ.179 చెల్లించాలి. మంత్లీ ప్లాన్‌పై రూ.50 పెరిగింది. (image: Amazon India)
5.ఇక క్వార్టర్లీ ప్లాన్ ధర ప్రస్తుతం రూ.329 ఉంటే డిసెంబర్ 14 నుంచి రూ.459 చెల్లించాలి. క్వార్టర్లీ ప్లాన్‌పై రూ.130 పెరిగింది. ప్రైమ్ మెంబర్షిప్ ధరల్ని పెంచబోతున్నట్టు అమెజాన్ ఇండియా అక్టోబర్‌లోనే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ప్రకటించింది. కానీ అప్పుడు తేదీలను ప్రకటించలేదు. డిసెంబర్ 14 నుంచి ధరలు పెరగబోతున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతలోపు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని కోరుతోంది. (image: Amazon India)
7. ఆహా ఓటీటీ ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ఓటీటీకి సంబంధించి మంత్లీప్లాన్ రూ.199 ఉండగా.. ఇయర్ ప్లాన్ రూ.364 ఉంది. సోనిపిక్చర్కు సంబంధించిన సోనీ-ఎల్ఐవీ ఇయర్ సబ్స్క్రిప్షన్ రూ.999గా ఉంది. సన్ గ్రూప్‌కు చెందిన సన్ నెక్స్ట్ మంత్లీ ప్లాన్ రూ.50 ఉంది. క్వార్టర్ ప్లాన్ రూ.130 ఉండగా ఇయర్ ప్లాన్ రూ.490 లతో అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. జీ గ్రూప్‌కు చెందిన జీ5 నెలవారీ చందా రూ.99 ఉంది. మూడు నెలలకు రూ.299 ఉండగా సంవత్సరానికి రూ.499 చందాతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. మరో యూరోస్ ఇంటర్నేషనల్ ఓటీటీ ధర నెలకు రూ.49 ఉండగా, మూడు నెలలకు రూ.79 సంవత్సరానికి రూ.399 ఉంది. ప్రస్తుతం అమెజాన్ ధరల పెంపుతో అన్ని కంపెనీలు ధరలు పెంచుతాయేమోనని ప్రజలు భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)