1. ఇంధన ధరల పెరుగుదలను సద్వినియోగం చేసుకునేందుకు క్రెడిట్ కార్డు కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ఖర్చులపై (Petrol Diesel Price) డిస్కౌంట్లు, రివార్డులు, క్యాష్ బ్యాక్‌లు ఇలా అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇంధన కొనుగోళ్లపై మరిన్ని క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ప్రవేశపెడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. బీపీసీఎల్ (BPCL), హెచ్‌పీ (HP) వంటి పలు క్రెడిట్ కార్డ్ కంపెనీలు చమురు కంపెనీలతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను పరిచయం చేస్తున్నాయి. తాజాగా ఎస్బీఐ కార్డ్ BPCL SBI కో-బ్రాండెడ్ రూపే కాంటాక్ట్‌లెస్ కార్డును లాంచ్ చేయడానికి భారత్ పెట్రోలియంతో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ కార్డ్ ద్వారా భారత్ పెట్రోలియం పెట్రోల్ బంకుల్లో ఇంధన కొనుగోళ్ల కోసం ఖర్చు చేసే ప్రతి రూ.100 పై 13X రివార్డ్ పాయింట్లను.. రూ. 4,000 వరకు జరిగే ప్రతి లావాదేవీపై 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపును పొందవచ్చు. ఇలా అనేక క్రెడిట్ కార్డు సంస్థలు చమురు ఖర్చులపై ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. తమ సొంత వాహనాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంధనం ఖర్చులు పెరుగుతున్న కొద్దీ.. కస్టమర్లు పొందే రివార్డులు, క్యాష్‌బ్యాక్ లు కూడా పెరుగుతాయి. తద్వారా చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డ్ కంపెనీలు చమురు కంపెనీలతో కలిపి ఇంధన కార్డులను జారీ చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ చమురు కంపెనీలు, క్రెడిట్ కార్డు సంస్థల షరతుల ప్రకారం.. రివార్డ్‌లు, రీఫండ్‌ను పొందాలంటే.. రోజువారీ లేదా నెలవారీ ఇంధన ఖర్చులు అధికంగా ఉండాలి. అందుకే ఈ తరహా క్రెడిట్ కార్డు తీసుకునే ముందు మీ వాస్తవ ఇంధన ఖర్చులను, ఆఫర్లు పొందేందుకు చేయాల్సిన ఇంధన ఖర్చులను పోల్చి చూడటం ముఖ్యం. ఫ్యూయల్ క్రెడిట్ కార్డును తీసుకోవాలనుకుంటే.. కార్డు మొత్తం ఖర్చు, వార్షిక, జాయినింగ్ ఫీజు వంటి ఇతర అంశాలను పూర్తిగా తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. కొన్ని కంపెనీలు వార్షిక ఖర్చుకు కొంత టార్గెట్‌ను నిర్ణయిస్తాయి. ఆ టార్గెట్‌ను మించి ఖర్చు చేస్తే వార్షిక ఫీజులను రద్దు చేస్తాయి. ఒకవేళ టార్గెట్‌ను మించి ఖర్చు చేయని పక్షంలో వార్షిక ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. దానివల్ల మీరు ఆదా చేయాలనుకున్న మొత్తం పొదుపుపై ప్రభావం పడుతుంది. అందుకే క్రెడిట్ కార్డు సంస్థల నిర్దిష్ట టార్గెట్‌కు మించి ఖర్చు చేయగల వారు మాత్రమే కార్డును తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. కో-బ్రాండెడ్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డును యూజ్ చేసేవారు.. నిర్దిష్ట ఇంధన స్టేషన్లలో పెట్రోల్/డీజిల్ కొనుగోలు చేస్తేనే రివార్డ్‌లను పొందగలరు. కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందుగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం. అలాగే రివార్డులు, సర్ఛార్జ్ మినహాయింపులు, రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోగల భాగస్వామ్య పెట్రోల్ పంపుల జాబితాను తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9. సాధారణంగా, ఫ్యూయల్ క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్లను భాగస్వామి అవుట్లెట్లలో ఇంధన కొనుగోళ్లపై రీడీమ్ చేయవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో రివార్డ్ పాయింట్లను గిఫ్ట్ వోచర్లుగా లేదా కొన్ని ప్రత్యేక ఆన్లైన్ స్టోర్లలో మాత్రమే రీడీమ్ చేసుకోవడానికి వీలుంటుంది. అందుకే మీ వినియోగానికి సరిపోయే ఇంధన క్రెడిట్ కార్డు కోసం మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు ఆలస్యమైతే.. కట్టాల్సిన పెనాల్టీ ఛార్జీలను కూడా మీరు పోల్చి చూసుకోవాలి. కొన్ని కార్డులు నిర్దిష్ట ఎక్స్పైరీ తేదీ వరకే రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేస్తాయి. మరికొన్నింటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అందువల్ల, క్రెడిట్ కార్డులు తీసుకునే ముందు మీరు అన్ని నిబంధనలు, షరతులను పూర్తిగా తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)