2. అవసరం ఉన్న సమయంలో ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ (Pre-approved Personel Loan) ఆప్షన్ ఉంటే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అర్హత ఉన్న కస్టమర్లకు ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌పై బ్యాంకులు మంచి డీల్స్ అందిస్తాయి. మంచి రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తులకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆప్షన్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ ఉన్నప్పుడు లోన్ ఆమోదం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ ప్రొఫైల్‌ను పరిశీలించిన తర్వాతే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ ఇస్తాయి. KYC డాక్యుమెంట్లకు యాక్సెస్ ఉంటుంది. సాధారణ పర్సనల్ లోన్‌తో పోలిస్తే ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌లో వడ్డీ తక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కొన్నిసార్లు జీరో ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపు ఛార్జీల మినహాయింపు, జీరో ఫోర్క్లోజర్ ఛార్జీలు వంటి ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌ను సులభంగా మొబైల్ యాప్, ఆన్లైన్లో పొందవచ్చు. లోన్ ద్వారా వచ్చే నిధులను ఎలా, ఎక్కడ ఉపయోగించాలో తెలిసినప్పుడు ఇలాంటి ఆఫర్లను అంగీకరించడం మంచిది. కేవలం అప్పు కోసం లోన్ యాక్సెప్ట్ చేయకూడదు. తిరిగి చెల్లించడాన్ని కూడా ప్లాన్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. అప్పటికే లోన్ కోసం చూస్తున్నవారికి ప్రీ అప్రూవ్డ్ లోన్ మంచి అవకాశం. లోన్ యాక్సెప్ట్ చేసే ముందు నిబంధనలు, వడ్డీ, ఇతర ఛార్జీల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం చేయకూడదు. తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుంటే, అవసరం ఉంటే ప్రీ అప్రూవ్డ్ లోన్ తీసుకోవడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వినియోగదారులకు బ్యాంకులు అందిస్తాయి. ఇందులో ఇన్‌కం, మంచి రీపేమెంట్ హిస్టరీ కీలకమైన అంశాలు. ఇలాంటి ఆఫర్లతో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. సులువుగా లోన్ పొందవచ్చు. ఆలస్యం లేదా డిఫాల్ట్ లేకుండా సకాలంలో తిరిగి చెల్లించేలా ప్లాన్ చేసుకోవడం అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ విషయంలో ఆయా బ్యాంకుల్లో ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ కీలకం అవుతుంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు లోన్లు ఇస్తాయి. రీపేమెంట్ సక్రమంగా చేస్తున్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకులో నిర్వహించే ట్రాన్సాక్షన్ల ఆధారంగా రీపేమెంట్ సామర్థ్యాన్ని బ్యాంకులు అంచనా వేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)