క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్, క్రెడిట్ కార్డ్ మినిమమ్ బిల్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ వివరాలు, పర్సనల్ ఫైనాన్స్" width="1200" height="800" /> 5. ఉదాహరణకు.. మీ కార్డు స్టేట్మెంట్ ఈ నెల 10న జనరేట్ అయితే, బిల్లింగ్ సైకిల్ అనేది ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ తరువాత నమోదయ్యే ట్రాన్సాక్షన్లు తరువాతి నెల స్టేట్మెంట్లో వస్తాయి. సాధారణంగా మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిన తేదీ ప్రకారం స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. మీ క్రెడిట్ కార్డ్‌ను యాక్టివేట్ చేసిన క్షణం నుంచి ఈ బిల్లింగ్ సైకిల్ ప్రారంభమవుతుంది. అన్ని లావాదేవీలు, క్యాష్ విత్‌డ్రాలు, లావాదేవీలకు సంబంధించిన ఛార్జీలు, బకాయి ఉన్న బ్యాలెన్స్ వడ్డీ.. వంటివన్నీ ప్రతి బిల్లింగ్ సైకిల్ తర్వాత జనరేట్ అయ్యే స్టేట్మెంట్లో ఉంటాయి. క్రెడిట్ కార్డు రకం, వాటిని జారీ చేసిన సంస్థ ఆధారంగా బిల్లింగ్ సైకిల్ మారవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. వ్యయ విధానాలు, వినియోగం, క్రెడిట్ వంటి అంశాలు దీనిపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వినియోగిస్తుంటే, బిల్లింగ్ సైకిల్‌పై మరింత శ్రద్ధ అవసరం. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ అనేది.. బిల్లింగ్ స్టేట్మెంట్ల మధ్య ఉండే వ్యవధి. బ్యాంకులను బట్టి ఈ గడువు 28 నుంచి 32 రోజుల మధ్య ఎక్కడైనా ఉండవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కొన్ని నివేదికల ప్రకారం 2021 నాటికి భారతదేశంలో సుమారు 6.4 కోట్ల క్రెడిట్ కార్డులు చెలామణిలో ఉన్నాయని అంచనా వేశాయి. అయితే క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బిల్లింగ్ సైకిల్ ఇందులో ప్రధానమైనది. క్రెడిట్ కార్డుల విషయంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
1. మన దేశంలో క్రెడిట్ కార్డ్ (Credit Card) వినియోగం ఏటా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. వివిధ బ్యాంకులు ప్రత్యేక అవసరాల కోసం విభిన్న క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. మంచి ఒప్పందాలు, సౌలభ్యం, భద్రతతో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా వీటిని ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. క్రెడిట్ కార్డు యూజర్లు మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లును ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ, కనీస ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాలి. లేదంటే మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. కనీస ఛార్జీలు అనేవి, మీరు చెల్లించాల్సిన బిల్లులో కొంత భాగం. క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఆలస్య రుసుము చెల్లించకుండా జాగ్రత్త పడటానికి, క్రెడిట్ కార్డ్‌ను యాక్టివేషన్లో ఉంచుకోవడానికి కనీస ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)