1. ఆధార్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కలిసి ఆధార్ కార్డ్ హోల్డర్ల కోసం భువన్ ఆధార్ పోర్టల్‌ని (Bhuvan Aadhaar Portal) ప్రారంభించాయి. ఈ పోర్టల్ సాయంతో మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్‌ను సులువుగా లొకేట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) ఈ పోర్టల్‌ను రూపొందించడం విశేషం. ఆధార్ కార్డ్ (Aadhaar Card) హోల్డర్లు భారతదేశంలోని అన్ని ఆధార్ సెంటర్ల వివరాలను, లొకేషన్‌ను ఈ పోర్టల్‌లో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డ్ హోల్డర్లు కొన్ని సేవల కోసం ఆధార్ సెంటర్‌కు, ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్లో ఈ వివరాలు ఉన్నా, కేవలం ఆధార్ సెంటర్ లొకేషన్ వివరాలు అందించేందుకు యూఐడీఏఐ ఇస్రోతో కలిసి భువన్ ఆధార్ పోర్టల్‌ని రూపొందించడం విశేషం. ఈ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డ్ హోల్డర్లు తమకు దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్ లొకేషన్ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆధార్ కార్డ్ హోల్డర్లు ముందుగా భువన్ ఆధార్ పోర్టల్ https://bhuvan.nrsc.gov.in/aadhaar/ ఓపెన్ చేయాలి. Centers Nearby, Search by Aadhaar Seva Kendra, Search by PIN Code, State-wise Aadhaar Seva Kendra ఆప్షన్స్ ఉంటాయి. Centers Nearby క్లిక్ చేసి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో చూడాలో ఆ వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. Search by Aadhaar Seva Kendra క్లిక్ చేసి ఆధార్ సేవా కేంద్రం పేరు టైప్ చేసి సెర్చ్ చేయాలి. Search by PIN Code క్లిక్ చేసి మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. State-wise Aadhaar Seva Kendra క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, ఊరి పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. ఇలా వేర్వేరు పద్ధతుల్లో మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్, ఆధార్ సేవా కేంద్రాల అడ్రస్, మ్యాప్‌లో లొకేషన్ తెలుసుకోవచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆధార్ సెంటర్ల వివరాలు ఈ పోర్టల్‌లో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. భువన్ పోర్టల్ విషయానికి వస్తే ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) రూపొందించిన పోర్టల్ ఇది. ఇందులో ఇస్రో సేకరించిన శాటిలైట్ డేటా ఉంటుంది. వరదలు, నీటి వనరలు, భూమి వివరాలు తెలుసుకోవచ్చు. భారత ప్రభుత్వానికి కావాల్సిన డేటాను ఈ పోర్టల్ అందిస్తుంది. ఇప్పుడు ఈ పోర్టల్‌లో ఆధార్ సెంటర్లను లొకేట్ చేయడానికి ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేయడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)