1. కొత్త కార్ కొనాలనుకుంటున్నారా? మీరు ఏ మోడల్ కార్ కొనాలనుకున్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి ఆఫర్స్ పొందొచ్చు. యోనో ఎస్బీఐ ద్వారా కార్ లోన్ (Car Loan) కోసం దరఖాస్తు చేసుకున్నా, కొత్త కార్ బుక్ చేసుకున్నా ఆఫర్స్ అందిస్తోంది ఎస్బీఐ. దాదాపు అన్ని ప్రధాన బ్రాండ్ల నుంచి ఈ ఆఫర్స్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. టాటా మోటార్స్, హుందాయ్, టోయోటా, ఆడి, కియా మోటార్స్, మారుతీ సుజుకీ, రెనాల్ట్ లాంటి బ్రాండ్స్ కార్లపై ఆఫర్స్ ప్రకటించింది ఎస్బీఐ. కస్టమర్లు చేయాల్సిందల్లా యోనో ఎస్బీఐ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా కార్ బుక్ చేయడమే. వారు ఈ ఆఫర్స్ పొందొచ్చు. మరి ఏ బ్రాండ్ నుంచి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి. (image: SBI)
3. మెర్సిడెస్ బెంజ్ కార్ కొంటే రూ.25,000 విలువైన క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది. ఆడీ కార్ బుక్ చేస్తే రూ.25,000 విలువైన అదనపు క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది. టాటా మోటార్స్ కార్ కొంటే రూ.5,000 వరకు అదనంగా క్యాష్ డిస్కౌంట్స్ పొందొచ్చు. టొయోటా కార్ కొంటే రూ.5,000 విలువైన యాక్సెసరీస్ ఉచితంగా పొందొచ్చు. డాట్సన్ కార్ కొంటే రూ.4,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రెనాల్ట్ కార్ కొంటే రూ.5,000 విలువైన యాక్సెసరీస్ ఉచితంగా పొందొచ్చు. హుందాయ్ కార్ బుక్ చేసుకుంటే సెలెక్టెడ్ మోడల్స్‌పై ప్రియార్టీ డెలివరీ లభిస్తుంది. మహీంద్రా ఎస్యూవీ కార్ బుక్ చేస్తే రూ.3,000 విలువైన యాక్సెసరీస్ ఉచితంగా పొందొచ్చు. మారుతీ సుజుకీ కారును ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. కియా మోటార్స్ కార్ కొంటే ప్రియార్టీ డెలివరీ సదుపాయం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. యోనో ఎస్బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా కార్ లోన్ తీసుకుంటే ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. కార్ లోన్ వడ్డీ రేట్లు 7.35 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. జీరో ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది. ఇన్‌స్టంట్‌గా ఇన్‌ప్రిన్సిపల్ అప్రూవల్ లభిస్తుంది. కొన్ని వాహనాలపై 100 శాతం ఫైనాన్సింగ్ లభిస్తుంది. మరి యోనో ఎస్బీఐ ప్లాట్ఫామ్లో కార్ లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ముందుగా యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేయాలి. మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. ముందే రిజిస్ట్రేషన్ చేసినవారు తమ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత Shop & Order పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Automobiles సెక్షన్ ఓపెన్ చేయాలి. తర్వాత కార్ సెలెక్ట్ చేయాలి. కార్ ఆర్డర్ చేసి లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఆ తర్వాత మీ వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి లోన్ అమౌంట్, టెన్యూర్ సెలెక్ట్ చేయాలి. చివరగా సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రాసెసర్ పూర్తి చేయాలి. కస్టమర్లు ముందుగానే తాము కొనాలనుకుంటున్న కార్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ షోరూమ్‌కి వెళ్లి లేదా ఆన్లైన్లో తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)