1. గోవా టూర్ వెళ్లడానికి యువత ఆసక్తి చూపిస్తూనే ఉంటుంది. అయితే ఇన్నాళ్లూ ఫ్లైట్‌లో, రైలులో, సొంత వాహనాల్లో గోవా టూర్ వెళ్లి ఉండొచ్చు. కానీ సరదాగా లగ్జరీ ఓడలో గోవా టూర్ (Goa Tour) వెళ్లే అవకాశం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism). ముంబై నుంచి గోవాకు 'గో గోవా గాన్' పేరుతో క్రూజ్ టూర్ ప్యాకేజీ (Cruise Tour Package) ప్రకటించింది. (image: IRCTC Tourism)
2. ముంబై నుంచి గోవాకు ఈ టూర్ ఉంటుంది. రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్లో ఒక రోజంతా లగ్జరీ క్రూజ్‌లో సముద్ర ప్రయాణం ఉంటుంది. వీకెండ్లో రెండు రోజులు టూర్ వెళ్లాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఫిబ్రవరి 12న ముంబైలో టూర్ ప్రారంభమై ఫిబ్రవరి 14న గోవాలో టూర్ ముగుస్తుంది. (image: IRCTC Tourism)
3. ఐఆర్సీటీసీ 'గో గోవా గాన్' క్రూజ్ టూర్ ప్యాకేజీ మొదటి రోజు ముంబైలో ప్రారంభమవుతుంది. ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు టూర్ ప్రారంభం అయ్యే సమయానికి ముంబై చేరుకోవాలి. మొదటి రోజు సాయంత్రం క్రూజ్‌లోకి ఎక్కాలి. సాయంత్రం 6 గంటలకు ముంబై నుంచి క్రూజ్ బయల్దేరుతుంది. రాత్రంతా సముద్ర ప్రయాణం ఉంటుంది. (image: IRCTC Tourism)
5. మూడో రోజు ఉదయం 7 గంటలకు క్రూజ్ గోవాకు చేరుకుంటుంది. దీంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్సీటీసీ 'గో గోవా గాన్' క్రూజ్ టూర్ ప్యాకేజీ ధర వేర్వేరుగా ఉంది. ఇంటీరియర్ ప్యాకేజీకి రూ.25,846, ఓషియన్ వ్యూ ప్యాకేజీకి రూ.32,044, బాల్కనీ ప్యాకేజీకి రూ.56,581, సూట్ ప్యాకేజీకి రూ.89,124, ఛైర్మన్స్ సూట్ ప్యాకేజీకి రూ.13,1224 చొప్పున చెల్లించాలి. (image: IRCTC Tourism)
6. పర్యాటకులకు బుక్ చేసుకునే ప్యాకేజీని బట్టి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంటీరియర్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఇంటీరియర్ స్టేట్ రూమ్స్‌లో బస లభిస్తుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజీ. ఒక రూమ్‌లో నలుగురు గెస్ట్‌లకు వసతి లభిస్తుంది. ఫుడ్ కోర్ట్, స్టార్‌లైట్ రెస్టారెంట్లో భోజన సదుపాయం ఉంటుంది. (image: IRCTC Tourism)
7. వీటితో పాటు స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, పబ్లిక్ ఏరియా, లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. ఎంటర్టైన్మెంట్ షోస్‌కు వెళ్లొచ్చు. క్యాసినో ఎంట్రీ కూడా లభిస్తుంది. కార్డేలియా అకాడమీ ఫర్ కిడ్స్ యాక్సెస్ కూడా ఉంటుంది. డీజే అండ్ పూల్ పార్టీకి అటెండ్ కావొచ్చు. ఈ ప్యాకేజీలో ఇన్స్యూరెన్స్ కూడా కవర్ అవుతుంది. (image: IRCTC Tourism)