1. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరంలో లాంగ్ వీకెండ్స్ (Long Weekends) చాలా ఉన్నాయి. అసలు ఈసారి కొత్త సంవత్సరం సెలవుతో ప్రారంభం కావడం విశేషం. 2023 లో 17 లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. వెకేషన్స్, ఫ్యామిలీ టూర్స్ (Family Tours), తీర్థయాత్రలు ప్లాన్ చేసుకునేవారికి లాంగ్ వీకెండ్స్ చాలా ముఖ్యం. (ప్రతీకాత్మక చిత్రం)
3. January: జనవరి 1 ఆదివారం. కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు. ముందు రోజు శనివారం కాబట్టి, శనివారం సెలవు ఉన్నవారు, అంతకు ముందు రోజు డిసెంబర్ 30 శుక్రవారం, జనవరి 2 సోమవారం సెలవు పెట్టుకుంటే చాలు. లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక జనవరి 14 శనివారం మకర సంక్రాంతి. జనవరి 15 ఆదివారం సెలవు. జనవరి 13 శుక్రవారం, జనవరి 16 సోమవారం సెలవు తీసుకుంటే నాలుగు రోజులు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక జనవరి 26 గురువారం రిపబ్లిక్ డే సెలవు. జనవరి 28 శనివారం, జనవరి 29 ఆదివారం సెలవులు ఉన్నవారు జనవరి 27 లీవ్ తీసుకుంటే నాలుగు రోజుల సెలవు ఎంజాయ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. August: ఆగస్ట్ 12 శనివారం. ఆగస్ట్ 13 ఆదివారం. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెలవు. ఆగస్ట్ 14 సెలవు తీసుకుంటే వరుసగా నాలుగు రోజుల సెలవు లభిస్తుంది. ఇక ఆగస్ట్ 26 శనివారం, ఆగస్ట్ 27 ఆదివారం. ఆగస్ట్ 30న రాఖీ పౌర్ణమి ఉంది. ఆగస్ట్ 28, 29 సెలవు తీసుకుంటే రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కాచెల్లెళ్లతో సెలవుల్ని ఎంజాయ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
10. September: సెప్టెంబర్ 7 గురువారం కృష్ణాష్టమి సందర్భంగా సెలవు. సెప్టెంబర్ 9 శనివారం, సెప్టెంబర్ 10 ఆదివారం సెలవు. సెప్టెంబర్ 8 సోమవారం సెలవు తీసుకుంటే లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 16 శనివారం, సెప్టెంబర్ 17 ఆదివారం. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా సెలవు. సెప్టెంబర్ 18 సోమవారం సెలవు తీసుకుంటే వరుసగా నాలుగు రోజులు హాలిడే ఎంజాయ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
12. November: నవంబర్ 11 శనివారం, నవంబర్ 12 ఆదివారం. నవంబర్ 12న దీపావళి కూడా వచ్చింది. నవంబర్ 10 లేదా నవంబర్ 13 సెలవు తీసుకుంటే కనీసం మూడు రోజులు దివాళీ సెలబ్రేట్ చేయొచ్చు. నవంబర్ 25 శనివారం, నవంబర్ 26 ఆదివారం, నవంబర్ 27 గురునానక్ జయంతి సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)