1. ఫెస్టివల్ సీజన్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ సేల్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కార్ల కొనుగోళ్లు (Car Sales) జోరుగా జరిగాయి. ఈసారి దసరాతో పాటు దీపావళి సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీకి బాగా కలిసివచ్చింది. ఫెస్టివల్ సీజన్లో వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రకటించిన లోన్ ఆఫర్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌తో ఇప్పటికే కార్లను కొనుగోలు చేశారు కస్టమర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
2. వివిధ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి లోన్ ఆఫర్లను అందిస్తున్నాయి. బ్యాంక్‌బజార్ డేటా ప్రకారం.. ప్రస్తుతం ఏడు సంవత్సరాల లోన్ రీపేమెంట్ పీరియడ్‌తో ఇచ్చే రూ. 10 లక్షల కొత్త కార్ లోన్‌పై చౌకైన లోన్లు అందించే టాప్ 10 బ్యాంకులను మనీకంట్రోల్ న్యూస్ పోర్టల్ వెల్లడించింది. బీఎస్ఈలో లిస్ట్ అయిన పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు అందించే కార్ లోన్ వడ్డీ రేట్లను (2022 అక్టోబర్ 21నాటికి) బ్యాంక్ బజార్ సేకరించింది. ఆ వివరాలు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)