1. నవంబర్ 2న ధంతేరాస్ (Dhanteras 2021) జరుపుకోవడానికి దేశమంతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీ ఏటా దీపావళికి రెండు రోజుల ముందు ధంతేరాస్ లేదా ధనత్రయోదశి జరుపుకోవడం భారతీయులకు ఆనవాయితీ. ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించినట్టు అన్న నమ్మకం, విశ్వాసం భారతీయుల్లో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అందుకే ధంతేరాస్ రోజున దేశంలోని నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. ఏ నగల షాపు (Gold Shop) చూసినా రద్దీగా కనిపిస్తుంటాయి. ఈసారి ధంతేరాస్ రోజున మార్కెట్లో గోల్డ్ షాపుల్లో రద్దీ ఉండటం ఖాయమే. ఇప్పటికే బడాబడా నగల షాపులు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. మరి ఈ ధంతేరాస్ రోజున మీరు కూడా గోల్డ్ కొనాలనుకుంటున్నారా? బంగారు ఆభరణాలు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే నగలు కొనేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎవరైనా ఆభరణాలు చూపించి ఇవి 24 క్యారెట్ అని చెప్తే నమ్మి మోసపోవద్దు. 24 క్యారెట్ గోల్డ్‌తో ఆభరణాలు తయారు చేయాలంటే అందులో ఇతర మెటల్స్‌ని కలపాల్సి ఉంటుంది. అందుకే ఆభరణాలు 22 క్యారెట్‌తో ఉంటాయి. ఇక 22 క్యారెట్ జ్యువెలరీ మాత్రమే కాదు... 18 క్యారెట్ నగలు కూడా ఉంటాయి. ఇందులో బంగారం స్వచ్ఛత తక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. 18 క్యారెట్ నగలనే 22 క్యారెట్ అని నమ్మించే మోసం చేసే అవకాశం ఉంది. అందుకే నగలు సెలెక్ట్ చేసేప్పుడు అవి 22 క్యారెట్ నగలా, 18 క్యారెట్ నగలా అన్న క్లారిటీ తీసుకోవాలి. అందుకే హాల్‌మార్క్ ఉన్న నగలు మాత్రమే తీసుకోవాలి. ఆ నగలపై హాల్‌మార్క్‌తో పాటు నగల స్వచ్ఛతను చూపించే ముద్ర ఉంటుంది. 22K అని ముద్రించి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. నగల షాపుల్లో లభించే 22 క్యారెట్ నగలనే 916 బంగారం అని కూడా అంటారు. 916 అంటే 91.6 శాతం అని అర్థం. అంటే అందులో 91.6 శాతం బంగారం ఉంటుంది. మీరు 100 గ్రాముల నగలు తీసుకుంటే అందులో 91.6 గ్రాముల గోల్డ్ ఉంటుంది. మిగతాది ఇతర మెటల్స్ ఉంటాయి. మీరు 18 క్యారెట్ నగలు తీసుకుంటే 22 క్యారెట్ నగల ధర కన్నా తక్కువ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. బిల్లులో మేకింగ్ ఛార్జీల వివరాలు కూడా రాయించాలి. నగలు కొంటే ఒరిజినల్ బిల్ తీసుకోవాలి. ఒరిజినల్ బిల్ కావాలంటే జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందని ఒరిజినల్ బిల్ లేకుండా నగలు కొంటుంటారు. ఒకవేళ నగల నాణ్యతలో ఏదైనా తేడా ఉంటే ఒరిజినల్ బిల్ ఉంటేనే మీరు గట్టిగా నిలదీసే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)