1. వేసవిలో చలచల్లని ప్రాంతానికి వెళ్లి ఓ నాలుగైదు రోజులు గడిపి వద్దామనుకుంటున్నారా? తెలంగాణ టూరిజం (Telangana Tourism) హైదరాబాద్ నుంచి ఊటీకి (Hyderabad to Ooty) టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో (Tour Package) ఊటీతో పాటు బెంగళూరు, మైసూరులోని పర్యాటక ప్రాంతాలు కూడా కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. తెలంగాణ టూరిజం అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగుతుంది. ప్రతీ సోమవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. బస్సులో తీసుకెళ్లి ఊటీ, బెంగళూరు, మైసూరులోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తుంది. ఈ ప్యాకేజీ ధర ఎంత, ఈ టూర్ ఎలా సాగుతుంది? తెలంగాణ టూరిజం వెబ్సైట్లో ఉన్న సమాచారం ఇదే. (ప్రతీకాత్మక చిత్రం)
4. రెండో రోజంతా బెంగళూరు లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. బుల్ టెంపుల్, లాల్ బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్ టెంపుల్ దర్శించుకోవచ్చు. రాత్రికి బెంగళూరులో బస చేయాలి. మూడో రోజు తెల్లవారుజామున ఊటీ బయల్దేరాలి. మధ్యాహ్నానికి ఊటీ చేరుకుంటారు. ఆ తర్వాత లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. దొడ్డపెట, బొటానికల్ గార్డెన్ చూడొచ్చు. రాత్రికి ఊటీలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. నాలుగో రోజు ఉదయం మైసూర్ బయల్దేరాలి. సాయంత్రానికి మైసూరు చేరుకుంటారు. బృందావన్ గార్డెన్ సందర్శించొచ్చు. రాత్రికి మైసూరులో బస చేయాలి. ఐదో రోజు ఉదయం మైసూరు లోకల్ సైట్‌సీయింగ్ ఉంటుంది. చాముండేశ్వరి ఆలయం, మైసూరు మహారాజ ప్యాలెస్, బిగ్ బుల్ టెంపుల్ సందర్శించొచ్చు. రాత్రికి మైసూరు నుంచి బయల్దేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. తెలంగాణ టూరిజం హైదరాబాద్ నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుమల, అరకు, షిర్డీ, శ్రీశైలం, వరంగల్, యాదగిరిగుట్ట లాంటి ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మరిన్ని వివరాలు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)