1. గోవా టూర్ (Goa Tour) వెళ్లేవారికి అలర్ట్. పర్మిట్ లేకుండా వెళ్తే రూ.10,000 పైనే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. బెంగళూరు నుంచి గోవాకు స్పెషల్ పర్మిట్ (Special Permit) లేకుండా వెళ్లిన 40 ట్యాక్సీలకు రూ.10,262 చొప్పున జరిమానా విధించారు. స్పెషల్ పర్మిట్ లేకుండా రాష్ట్ర సరిహద్దు దాటినందుకు ట్యాక్సీ ఓనర్లు ఈ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. సాధారణంగా కారుకు పర్మిట్ తీసుకుంటే రూ.200 లోపే ఖర్చవుతుంది. ఆర్టీఓ కార్యాలయాల్లో లేదా ఆన్లైన్లో పర్మిట్ తీసుకోవచ్చు. కానీ సరిహద్దులో ఉండే చెక్‌పోస్టులో స్పెషల్ పర్మిట్ తీసుకోవచ్చన్న ఆలోచనతో అనేక మంది కర్నాటక మీదుగా గోవాకు వెళ్లారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఇన్ హ్యాండ్ పర్మిట్ సర్వీస్ నిలిచిపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆన్లైన్లో లేదా ఆర్టీఓ కార్యాలయాల్లో స్పెషల్ పర్మిట్ తీసుకోవాల్సి వస్తోంది. ఈ విషయం తెలియనివారు సరిహద్దు దాటి చిక్కుల్లో పడుతున్నారు. భారీ జరిమానా చెల్లించాల్సి వస్తోంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాల్లో పర్మిట్ ఇచ్చేందుకు ఆన్లైన్ సేవల్ని ప్రారంభించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. కానీ కర్నాటకలో ఇంకా ఆన్లైన్ సర్వీస్ ప్రారంభం కాలేదు. కర్నాటక రాష్ట్రానికి చెందినవారు ఆర్టీఓ కార్యాలయాల్లోనే స్పెషల్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియని టూరిస్టులు భారీ జరిమానాలు చెల్లిస్తున్నారు. ట్యాక్సీకి రూ.10,662, వ్యాన్‌కు రూ.17,000, బస్సుకు రూ.25,000 చొప్పున జరిమానా వసూలు చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక గోవాలో మరో కొత్త రూల్ అమలులోకి వచ్చింది. ఐఎస్ఐ సర్టిఫికేషన్ లేని హెల్మెట్ ధరించి టూవీలర్ నడిపితే జరిమానా చెల్లించాల్సి వస్తుందని గోవా పోలీసులు హెచ్చరిస్తున్నారు. నాన్ ఐఎస్ఐ హెల్మెట్లపైన నిషేధం విధించారు గోవా పోలీసులు. టూవీలర్ నడిపేవారు తప్పనిసరిగా ఐఎస్ఐ హెల్మెట్స్ మాత్రమే ధరించాలి. (ప్రతీకాత్మక చిత్రం)