1. రొటీన్ జాబ్ బోర్ కొడుతోందా? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేయలేకపోతున్నారా? కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. టాలెంట్ ఉండాలే కానీ ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదించొచ్చు. బయటకు వెళ్లినా అనేక అవకాశాలు ఉన్నాయి. టైమింగ్స్‌తో సంబంధం లేకుండా మీకు నచ్చినప్పుడు పనిచేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు, రొటీన్ జాబ్ కాకుండా కొత్త మార్గాల్లో ఉపాధి పొందాలనుకుంటున్నవారు కొత్త కొత్త ఐడియాల గురించి ఇంటర్నెట్లో వెతుకున్నారు. మరి మీరు కూడా రొటీన్ జాబ్ వదిలేసి సరికొత్త మార్గంలో ఉపాధి పొందాలనుకుంటే ఈ ఐడియాలతో సులువుగా డబ్బు సంపాదించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. Blogging: మీకు ఏదైనా రంగంలో నైపుణ్యం ఉందా? ఆ రంగానికి సంబంధించిన అంశాలపై బాగా రాయగలరా? అయితే మీరు ఓ బ్లాగ్ మెయింటైన్ చేయొచ్చు. ఉదాహరణకు మీకు పర్సనల్ ఫైనాన్స్, కుకింగ్ లాంటి అంశాలపై నైపుణ్యం ఉంటే వాటిపై ఆర్టికల్స్ రాయొచ్చు. మంచి ఎస్ఈఓతో మీ ఆర్టికల్స్ ప్రమోట్ చేసుకుంటే యాడ్స్ ద్వారా ఆదాయం వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Stock Market: మీ దగ్గర కొంత డబ్బు ఉంటే ఆ డబ్బుతో మరింత ఆదాయం పొందడానికి స్టాక్ మార్కెట్ ఓ మార్గం. మార్కెట్ పరిస్థితులను బట్టి మంచి స్టాక్స్‌లో ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ చేయడం ద్వారా లాభాలు పొందొచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్‌తో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)