2. నగల షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. మరి మీరు కూడా ధంతేరాస్ రోజున గోల్డ్ కొనాలనుకుంటున్నారా? బంగారం కొంటే ట్యాక్స్ చెల్లించాలి. అయితే మీరు బంగారం ఏ రూపంలో కొన్నారనేదానిపై ట్యాక్స్ ఆధారపడి ఉంటుంది. మరి ఫిజికల్ గోల్డ్ కొంటే ట్యాక్స్ ఎంత? డిజిటల్ గోల్డ్‌కు పన్నులు ఎలా వర్తిస్తాయి? పేపర్ గోల్డ్‌కు పన్నులు ఉంటాయా? తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఫిజికల్ గోల్డ్ అంటే బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్స్ లాంటివాటికి 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. బంగారు ఆభరణాలు చేయిస్తే మేకింగ్ ఛార్జీలపైన అదనంగా 5 శాతం పన్నులు ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ లేదా గోల్డ్ బిస్కిట్లను ఎక్స్ఛేంజ్ చేసి, అంతే బరువుతో నగలు చేయిస్తే జీఎస్టీ ఉండదు. బరువు ఎక్కువ ఉంటే ఆ మొత్తానికి జీఎస్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక ఇటీవల డిజిటల్ గోల్డ్ కొనేవారి సంఖ్య పెరుగుతోంది. బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్స్ కొంటే వాటిని భద్రపర్చడం ఓ సవాల్. అందుకే డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు ఉన్నాయి. డిజిటల్ గోల్డ్ కొన్నా 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. మీరు డిజిటల్ గోల్డ్ 36 నెలల లోపు హోల్డ్ చేసి అమ్మితే పన్నులు ఏమీ ఉండవు. అంతకన్నా ఎక్కువ రోజులు డిజిటల్ గోల్డ్ హోల్డ్ చేసి అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. దీంతో పాటు సర్‌ఛార్జీ, 4 శాతం సెస్ అదనంగా చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఆభరణాలు కావాలనుకుంటే బంగారు నగలను కొనొచ్చు. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫిజికల్ గోల్డ్ కొంటే భద్రపర్చడం ఓ సవాలుగా ఉంటుంది. పెట్టుబడి కోసం గోల్డ్‌ని ఒక ఆప్షన్‌గా ఎంచుకుంటే మాత్రం డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)