1. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. దీంతో బంగారం అమ్మకాలు జోరుగా జరగనున్నాయి. ధంతేరాస్ ధంతేరాస్ సందర్భంగా రెండు రోజుల్లో 39 టన్నుల అంటే 39,000 కిలోల బంగారం అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా నగల అమ్మకాలు భారీగా జరగనున్నాయి. మరి మీరు కూడా పెళ్లిళ్లు, ఫంక్షన్ల సందర్భంగా గోల్డ్ కొంటున్నారా? అయితే బిల్లు తీసుకునేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. మీరు నగల షాపులో ఆభరణాలు కొన్నప్పుడు ప్రామాణికమైన, ఒరిజినల్ బిల్స్ తీసుకోవాలని, తర్వాత ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఫిర్యాదు చేయడానికి ఈ బిల్ తప్పనిసరి అని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చెబుతోంది. మీరు నగలు కొన్నప్పుడు అవి హాల్మార్క్ నగలేనా కాదా అని చెక్ చేయాలి. బిల్లులో హాల్మార్క్ అని ఉంటే సరిపోదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. నగలపైనా హాల్మార్క్ ముద్ర తప్పనిసరిగా చెక్ చేయాలి. హాల్మార్క్ ఎన్ని క్యారెట్లకు ఉందో కూడా చెక్ చేయాలి. 18K, 22K అని వేర్వేరుగా ఉంటాయి. మీ దగ్గర 22 క్యారెట్ డబ్బులు వసూలు చేసి, 18 క్యారెట్ల నగల్ని అమ్మితే మీరు మోసపోయినట్టే. అందుకే మీ నగల వివరాలన్నీ బిల్లులో తప్పనిసరిగా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ నగలకు ఇంత మొత్తం అయింది అని మొత్తం కలిపి ఒకే అమౌంట్ రాయించకూడదు. తప్పనిసరిగా బ్రేకప్ బిల్ తీసుకోవాలి. అంటే దేని కోసం ఎంత ఛార్జ్ చేశారో వేర్వేరుగా రాస్తే తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. ఇలా వివరాలన్నీ వేర్వేరుగా రాసి, ఒరిజినల్ బిల్ తీసుకుంటే, తర్వాత ఆభరణాల్లో ఏదైనా తేడా ఉన్నట్టు మీకు అనిపిస్తే ఫిర్యాదు చేయడానికి సులువు అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)