1. కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. దీంతో సామాన్యులకు ఆర్థిక కష్టాలు తప్పట్లేదు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటివారికి ఓ గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.5,00,000 వరకు పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. ష్యూరిటీ కూడా అవసరం లేదు. కోవిడ్ 19 సంబంధిత చికిత్సకు అయ్యే ఖర్చుల కోసమే బ్యాంకులు ఈ రుణాలు ఇస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కరోనా వైరస్ సెకండ్ వేవ్ సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI తీసుకున్న కోవిడ్-19 కీలక నిర్ణయంలో భాగంగా బ్యాంకులు ఈ రుణాలు ఇస్తున్నాయి. కనీసం రూ.25,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు రుణాలు తీసుకోవచ్చు. వెంటనే చెల్లించాల్సిన అసరం లేదు. ఐదేళ్ల గడువు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)