1. భారత ప్రభుత్వానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఇటీవల కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అతితక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ఆఫర్ (Home Loan Offer) ప్రకటించింది. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. కేవలం 6.50 శాతం వడ్డీతో గృహ రుణాలను అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇండస్ట్రీలో అతితక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా చేరింది. అంతేకాదు... ప్రాసెసింగ్ ఫీజును కూడా పూర్తిగా తొలగించింది. గతంలో 6.75 శాతం వార్షిక వడ్డీ రేటుతో గృహ రుణాలను అందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ వడ్డీని ఏకంగా 25 బేసిస్ పాయింట్స్ అంటే పావు శాతం తగ్గించి 6.50 శాతం వడ్డీతో రుణాలు ఇస్తామని ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. బ్యాంక్ ఆఫ్ బరోడా పరిశ్రమలో అతి తక్కువ, అత్యంత పోటీతత్వ గృహ రుణ రేట్లలో ఒకటిగా నిలిచిందని బ్యాంకు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొత్తగా గృహరుణాలు తీసుకునవారికి, ఇతర బ్యాంకుల్లో ఉన్న హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేవారికి స్పెషల్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ ఆఫర్ కింద ఎంత మొత్తానికైనా హోమ్ లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక హోమ్ లోన్ ఇండస్ట్రీలో తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకుల జాబితా చూస్తే కొటక్ మహీంద్రా బ్యాంక్ 6.55 శాతం, సిటీ బ్యాంక్ 6.75 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.60 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.50 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.75 శాతం, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ 6.70 శాతం చొప్పున ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ 6.90 శాతం, యాక్సిస్ బ్యాంక్ 6.90 శాతం, కెనెరా బ్యాంక్ 6.90 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 6.85 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 6.50 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.40 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.50 శాతం, ఐడీబీఐ బ్యాంక్ 6.75 శాతం, పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్ 6.75 శాతం వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)