ARE PLANNING TO BUILD HOME LIC HOUSING FINANCE REDUCES HOME LOAN RATES CHECK LATEST RATES HERE SK
Home Loans: ఇల్లు కొనాలనుకునే వారికి శుభవార్త చెప్పిన ఎల్ఐసీ హౌసింగ్.. వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు
Home Loan offers: మీరు కొత్తగా ఇల్లు కొనాలని భావిస్తున్నారా? సొంతింటి కలను నిజం చేసుకోవాలని అనుకుంటున్నారా? ఐతే మీకే ఈ శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది.
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రత్యేక పరిమిత కాల ఆఫర్ కింద గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు జులై 2న వెల్లడించింది. గృహ రుణాలపై వడ్డీ రేటను 6.66 శాతానికి తగ్గించినట్లు తెలిపింది.
2/ 8
కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారు ఆగస్టు 31, 2021 లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
నెలా నెలా జీతం ఉందే పొందే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు రూ.50 లక్షల వరకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు 6.66 శాతం నుంచి ప్రారంభమవుతాయని ఎల్ఐసీ తెలిపింది. రుణగ్రహీతల సీబీల్ స్కోర్‌ను ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకుంటామని వెల్లడించింది.
4/ 8
సిబిల్ స్కోర్ 700కు పైగా ఉన్న వారికి 6.66 శాతం నుంచి వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలిపింది. గరిష్టంగా 30 సంవత్సరాల గడువు వరకు గృహ రుణాలపై అతి తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నట్లు తెలిపారు.
5/ 8
రుణగ్రహీతలు గృహ రుణాల కోసం ఆఫీస్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ కి చెందిన HomY app ద్వారా ఆన్లైన్లోనేదరఖాస్తు చేసుకోవచ్చు. రుణ దరఖాస్తులను అక్కడే ట్రాక్ చేసుకోవచ్చు
6/ 8
ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ HomY app ద్వారా తమ వినియోగదారులకు డోర్ స్టెప్ సర్వీస్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. హోమ్ లోన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.lichousing.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.