1. శీతాకాలంలో అరకు అందాలు చూసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అరకుతో పాటు వైజాగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (APTDC) ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. తక్కువ ధరకే ఒక రోజు అరకు టూర్ ప్యాకేజీ (Araku Tour Package) ఆపరేట్ చేస్తోంది. అరకు అందాలు చూడాలనుకునే పర్యాటకులు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. విశాఖపట్నం లోకల్ సైట్ సీయింగ్ కోసం ఏపీటీడీసీ ఒక రోజు టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. వైజాగ్ లోకల్ టూర్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు కైలాసగిరి, సింహాచలం, తొట్లకొండ, ఫిషింగ్ హార్బర్లో బోటింగ్, రిషికొండ బీచ్, విశాఖ సబ్ మెరైన్ మ్యూజియం, జాతర శిల్పారామం లాంటి పర్యాటక ప్రాంతాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. విశాఖపట్నం లోకల్ సైట్ సీయింగ్ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.910, పిల్లలకు రూ.730. టూర్ ప్యాకేజీలో ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, లంచ్ కవర్ అవుతాయి. నాన్ ఏసీ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. నాన్ ఏసీ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.760, పిల్లలకు రూ.610. రాత్రివేళలో వైజాగ్ అందాలు చూడాలనుకునేవారి కోసం విశాఖపట్నం లీజర్ నైట్ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది ఏపీటీడీసీ. (ప్రతీకాత్మక చిత్రం)
7. విశాఖపట్నం లీజర్ నైట్ టూర్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు ఫిషింగ్ హార్బర్, సబ్‌మెరైన్ మ్యూజియం, కైలాసగిరి, జాతర శిల్పారామం చూడొచ్చు. రుషికొండ బీచ్‌లోని హరిత రిసార్ట్‌లో డిన్నర్ ఉంటుంది. ఈ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.448, పిల్లలకు రూ.340. టూర్ ప్యాకేజీలో సైట్ సీయింగ్, డిన్నర్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)