APPLYING FOR PAN CARD OR MAKING CORRECTIONS IN EXISTING PAN CARD DONT MAKE THESE 10 MISTAKES IN APPLICATION SS
PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
PAN Card Application | పాన్ కార్డ్... ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి తప్పనిసరిగా అవసరం. మరి మీ దగ్గర పాన్ కార్డు ఉందా? కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేస్తున్నారా? లేదా ఇప్పటికే ఉన్న పాన్ కార్డులో తప్పుల్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నారా? పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ చాలా కీలకమైన డాక్యుమెంట్. పాన్ కార్డు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం సాధ్యం కాదు. అందుకే పాన్ కార్డులో ఏ చిన్న తప్పు చేసినా తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
2/ 13
ఆదాయపు పన్ను చట్టంలోనే సెక్షన్ 272బీ కింద ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డు ఉన్నా చిక్కుల్లో పడాల్సివస్తుంది. రూ.10,000 జరిమానా చెల్లించక తప్పదు. అందుకే పాన్ కార్డు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.
3/ 13
ఇప్పటివరకు మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే 49ఏ ఫామ్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు. మీ పాన్ కార్డులో ఉన్న తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. వివరాలు అప్డేట్ చేయొచ్చు. మరి పాన్ కార్డు విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోండి.
4/ 13
1. పాన్ కార్డ్ దరఖాస్తుపై మీ ఫోటోను పిన్ చేయకూడదు. బాక్స్‌లో అతికించాలి.
5/ 13
2. పాన్ కార్డు దరఖాస్తు ఫామ్ నింపేటప్పుడు ఏవైనా తప్పులు రాస్తే వాటిని దిద్దకూడదు. కొత్త ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
6/ 13
3. సంతకాన్ని బాక్సులోనే చేయాలి. మీ సంతకం బాక్సు దాటి వెళ్లకూడదు.
7/ 13
4. ఫోటోపైన సంతకం చేయకూడదు. ఫోటోపైన పెన్ను గీతలు, గుర్తులు ఉంటే మీ దరఖాస్తును తిరస్కరించే అవకాశముంది.
8/ 13
5. పూర్తి పేరు రాయడం మర్చిపోవద్దు. పేరును షార్ట్ కట్లో రాయొద్దు. తేదీ, హోదా లాంటి అనవసరమైన వివరాలు రాయొద్దు.
9/ 13
6. ఇప్పటికే మీ దగ్గర పాన్ కార్డు ఉంటే మరో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం చట్టవిరుద్ధం. అయితే అదే నెంబర్‌తో కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చు. పాన్ కార్డులో వివరాలను మార్చుకోవచ్చు.
10/ 13
7. తండ్రి పేరు రాయాల్సిన చోట భార్య లేదా భర్త పేరు రాయకూడదు.
11/ 13
8. మీ ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ తప్పులు లేకుండా రాయాలి.
12/ 13
9. దరఖాస్తు ఫామ్ పైన సంతకం చేయడం మర్చిపోవద్దు. సూచించిన చోట సంతకం చేయకపోతే దరఖాస్తును అనుమతించరు.
13/ 13
10. మీ దరఖాస్తు ఫామ్‌ను మీ దగ్గర్లోని NSDL అడ్రస్‌కు పంపాలి.