Apple India: 2019-2020 ఆర్థిక సంవత్సరంలో... యాపిల్ ఇండియా రెవెన్యూ రూ.13,756 కోట్లకు చేరింది. ఏటా ఈ కంపెనీ 29 శాతం రెవెన్యూ పెంచుకుంటోంది. ఐతే... నికర లాభాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 253 శాతం పెరిగి... మొత్తం రూ.926 కోట్లు వచ్చాయని... టోఫ్లెర్ సోర్స్ ప్రకారం తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఖర్చులు రూ.12,469 కోట్లుగా తేలాయి. అమెరికా కంపెనీ... యాపిల్‌కి ఇండియాలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
ఇండియాలో సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌కి రికార్డ్ సేల్స్ జరిగిందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్... గత వారం ప్రకటించారు. సెప్టెంబర్ క్వార్టర్‌కి ఈ కంపెనీ 7 లక్షల ఐ ఫోన్ల (i Phone)ను ఇండియాలో అమ్మినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్‌లో తేలింది. దీనిపై యాపిల్ కంపెనీ మాత్రం స్పందించలేదు.
మరో రీసెర్చ్ కన్సల్టెన్సీ కంపెనీ ఫొర్రెస్టెర్ ప్రకారం... యాపిల్ ఆల్రెడీ... ఈ నెలలో మొదటి వారం నాటికే 4 లక్షల దాకా ఐ ఫోన్లను అమ్మింది. ఎక్కువ మంది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఐ స్టోర్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుక్కున్నారు. యాపిల్... తన ఆన్లైన్ స్టోర్‌ను ఇండియాలో సెప్టెంబర్ 23న ప్రారంభించింది.
కౌంటర్ పాయింట్ తాజా రిపోర్ట్ ప్రకారం... చైనా నుంచి పోటీ ఇస్తున్న వన్ ప్లస్ కంపెనీ తయారుచేస్తున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ హ్యాండ్ సెట్ల అమ్మకాలకు సెప్టెంబర్‌లో యాపిల్ గట్టి దెబ్బ తీసింది. ఆ హ్యాండ్ సెట్ల ధర ఇండియాలో రూ.30,000 దాకా ఉంది. ఐతే... యాపిల్‌కి చెందిన ఐఫోన్ SE 2020, ఐఫోన్ 11 లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది.
యాపిల్ సక్సెస్‌కి కారణం... హ్యాండ్ సెట్లను ఇండియాలో తయారుచేయించడమే. దీని వల్ల వాటి ధర తగ్గింది, సేల్స్ పెరిగింది. అందువల్ల సెప్టెంబర్‌లో రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయి. యాపిల్ ఇదే ఫార్ములాతో ముందుకి వెళ్తూ... ధరలను మరింత తగ్గిస్తే... అదిరిపోయే రేంజ్ సేల్స్ కనిపిస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.