అయితే నెల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో రెపో రేటు 6.50 శాతానికి చేరింది. ఈ క్రమంలో బ్యాంకులు సైతం రుణాలపై వడ్డీ రేట్లు పెంచాయి. మరోవైపు ఎఫ్డీలపై అధిక వడ్డీలు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ పెంచుతూ ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాజాగా ఓ ప్రకటన చేసింది.
సాధారణ కస్టమర్లకు ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలపై 8.41% వడ్డీ ఇస్తుండగా సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 9.01% వరకు వడ్డీ ఇస్తుంది. ఇవి 2023 మార్చి 24 నుంచే అమల్లోకి వచ్చాయి. దేశంలో దిగ్గజ బ్యాంకులయిన ఎస్బీఐ (SBI), పీఎన్బీ (PNB), హెచ్డీఎఫ్సీ(HDFC) వంటి వాటికన్నా ఫిన్‌కేర్ ఎక్కువ వడ్డీ ఇస్తుండటం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
* ఎన్నిరోజుల వ్యవధికి?
సీనియర్ సిటిజన్లకు 1000 రోజుల కాలపరిమితికి ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 9.1% వడ్డీ ఇస్తోంది. 59 నెలల 1 రోజు నుంచి 66 నెలల డిపాజిట్లపై 8.6% వడ్డీ ఇస్తోంది. ఈ మొత్తం వివిధ బ్యాంకులల్లో 5 ఏళ్ల టర్మ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)
వృద్ధుల ఆర్థిక శ్రేయస్సు కోసం
వృద్ధుల ఆర్థిక శ్రేయస్సు కోసమే అత్యుత్తమ వడ్డీ రేట్లు ఇస్తున్నట్లు ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో రాజీవ్ యాదవ్ తెలిపారు. తమ బ్యాంకులో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అవకాశం ఉందని, అందులో కస్టమర్లు తమకు నచ్చిన టెన్యూర్‌ను ఎంచుకునే అవకాశం ఉందన్నారు. రెగ్యులర్ ట్యాక్స్ సేవింగ్, క్యుములేటివ్ డిపాజిట్ వంటి వాటిని కూడా సెలక్ట్ చేసుకునే అవకాశం ఉందన్నారు. సాధారణ కస్టమర్లను ప్రోత్సహించేందుకు ఇతర బ్యాంకులతో కన్నా అధికంగా 8.41 శాతం వరకు వడ్డీ ఇస్తున్నట్లు ఆయన వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఫిన్‌కేర్ అందిస్తున్న సేవలు
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేక రకాల సేవలు అందిస్తోంది. సేవింగ్స్, కరెంట్ అకౌంట్, ఎఫ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అధిక వడ్డీలు, మార్టిగేజ్, గోల్డ్ లోన్‌తో పాటు యూనిఫైడ్ పేమెంట్స్, ఇంటర్ఫేస్ సేవలను అందిస్తోంది. దేశంలో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశం మొత్తం మీద 2 వేల మంది ఇందులో పని చేస్తున్నారు. 2022 మార్చి 31 నాటికి 32 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు.