ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్లో ఒక వీడియో ఉంది. ఇది ఎలక్ట్రిక్ బైక్కు చెందింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఒకేసారి ఆరు మంది కూర్చోవచ్చు. ఒక అబ్బాయి ఈ ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశాడు. ఒకరి వెనుక మరొకరు ఇలా ఆరు మంది ఈ ఎలక్ట్రిక్ బైక్పై కూర్చోవచ్చు. ఒకరు డ్రైవ్ చేస్తుంటే.. ఐదు మంది కూర్చోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయడానికి దాదాపు రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ఖర్చు అయ్యిందని ఆ అబ్బాయి తెలియజేశారు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్లు వెళ్తుందని పేర్కొన్నారు. చార్జింగ్ కాస్ట్ రూ. 8 నుంచి రూ.10 వరకు ఉందని తెలిపారు. అంటే ఈ వెహికల్పై ఆరు మంది వెళ్లొచ్చు. అంటే రూ.1.6 ఖర్చుతో 150 కిలోమీటర్లు వెళ్లొచ్చని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ ఎంతో మనకు తెలియదు.