దేశమంతా దీపావళి సంబరాలు ప్రారంభమైన వేళ సామాన్యులకు మరో షాక్ తగిలింది. ప్రముఖ అమూల్ సంస్థ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. కంపెనీ తన పాల ధర ఢిల్లీలో లీటరుకు రూ.2 పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈరోజు ఉదయం పాలు కొనేందుకు వచ్చిన ప్రజలు లీటర్ పాల ప్యాకెట్‌పై రూ.61కి బదులు రూ.63 పెంచినట్లు తెలుసుకుని షాక్ కు గురయ్యారు. అమూల్ ఫుల్ క్రీమ్ మిల్క్ ధరను లీటరుకు రూ.61 నుంచి రూ.63కి పెంచింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అయితే పాల ధర పెంపుపై కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే.. అమూల్ తర్వాత ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా ఈ పండుగ సీజన్లో పాల ధరలను పెంచే అవకాశం ఉందన్న వార్తలతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ తన పాల ఉత్పత్తులను అమూల్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. ప్రముఖ పాల బ్రాండ్లు అమూల్ మరియు మదర్ డెయిరీ గత ఆగస్టులో పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అంతకు ముందు మార్చిలో పాల ధరలు పెరిగాయి. తాజాగా మళ్లీ ధరలు పెరిగాయి. భారతీయ గృహాలలో పాలు విస్తృతంగా ఉపయోగించబడుతున్న పదార్థం. కాబట్టి ఈ ధరల సామాన్యులపై ప్రభావం పడనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈ వారం రెండు కంపెనీలు పాల ధరలను పెంచాయి. అక్టోబర్ 11న మేధా, సుధా డెయిరీ పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ రెండు కంపెనీల పాల ధర లీటరుకు రూ.2 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)