3. ఆపరేషన్, పాల ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల పాల ధరల్ని పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే కేవలం పశువుల దాణా ఖర్చు దాదాపు 20 శాతానికి పెరిగిందని కంపెనీ చెబుతోంది. ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని, తమ సభ్య సంఘాలు కూడా రైతుల ధరలను గత ఏడాది కంటే 8-9 శాతం వరకు పెంచినట్టు కంపెనీ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అమూల్ మాత్రమే కాదు భారతదేశంలో ప్రైవేట్ డెయిరీల్లో ఒకటైన గోవర్ధన్ బ్రాండ్ కూడా పాల ధరల్ని పెంచింది. లీటర్ పాలపై రూ.2 ధర పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో గోవర్ధన్ పాల ధర లీటర్కు రూ.54 నుంచి రూ.56 కి పెరిగింది. ఈ బ్రాండ్ గత నెల రోజుల్లోనే రెండుసార్లు పాల ధరల్ని పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)