Amazon: ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అందరికీ తెలిసిందే. జనరల్‌గా ఈ రోజుల్లో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ అంటే... దేశీయ ఈ-కామర్స్ సైట్లతోపాటూ.. ఆమెజాన్లోనూ ఐటెమ్స్ కొనుక్కుంటున్నారు. మిగతా సైట్లలాగే... అమెజాన్ కూడా అప్పుడప్పుడూ ఆఫర్ల ఫెస్టివల్స్ జరుపుతోంది. అలాగే... డిస్కైంట్లు, కూపర్లు, ఆఫర్ల వంటివి ఇస్తోంది. ఐతే... ఇంకా తక్కువ ధరకు ఆ ఐటెమ్స్ కొనుక్కోవడం ఎలా అన్నది చాలా మందికి తెలియదు. ఇదెలా సాధ్యమంటే... అమెజాన్‌కి ఓ సీక్రెట్ వెబ్సైట్ ఉంది. అక్కడ ఏ వస్తువులైనా సగం ధరకే లభిస్తాయి. సపోజ్ రూ.7వేలు ధర ఉన్న వస్తువు అక్కడ రూ.2వేలకే లభిస్తుంది. (image credit - Amazon.com)
కరోనా లాక్డౌన్ సమయంలో చాలా స్టోర్లు మూతపడినప్పుడు... చాలా మంది షాపింగ్ కోసం అమెజాన్‌పై ఆధారపడ్డారు. అదే సమయంలో అమెజాన్ కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించింది. అమెజాన్ సీక్రెట్ వెబ్సైట్లో మీరు రిటర్న్ ఐటెమ్స్ కొనవచ్చు. లేదా కొద్దిగా డ్యామేజ్ అయిన వాటిని కొనవచ్చు. వాటి ధర చాలా తక్కువే ఉంటుంది. అమెజాన్‌లో వాడిన, లూజ్ బాక్స్ ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకే అమ్ముతోంది. (image credit - Amazon.com)
మార్టిన్ లెవిస్ వెబ్సైట్ మనీ సేవింగ్స్ ఎక్స్పర్ట్ డాట్ కామ్ ప్రకారం... ఓ యూజర్ ఏమన్నారంటే... "ఓసారి నేను అమెజాన్ వేర్ హౌస్ వెబ్సైట్ (https://www.amazon.com/Warehouse-Deals/b?ie=UTF8&node=10158976011)కి వెళ్లాను. ప్రెషర్ వాషర్ కొనాలి అనుకున్నాను. నేను కొనాలి అనుకున్న మోడల్ ధర చాలా ప్రముఖ వెబ్సైట్లలో రూ.20వేల దాకా ఉంది. అలాంటి ఉత్పత్తిని అమెజాన్‌లో తక్కువ ధరకు కొనుక్కున్నా.. దాన్ని బాగా పరిశీలించి ఏ గ్రేడ్ ఇచ్చాను" అన్నారు. ఈ వేర్‌హౌస్ అనేది అమెజాన్ వెబ్సైట్లో భాగంగానే సీక్రెట్‌గా ఉంటుంది. (image credit - Amazon.com)
ఈ సీక్రెట్ వెబ్సైట్ ద్వారా ఐటెమ్స్ కొనుక్కున్నవారికి కూడా అమెజాన్ సర్వీసులన్నీ అందుతాయి. అమెజాన్ రిటర్న్ పాలసీ దీనికి కూడా వర్తిస్తుంది. అంటే... ఆ వస్తువు కొన్నాక... నచ్చకపోతే... రిటర్న్ ఇచ్చేయవచ్చు. 30 రోజుల్లో వెనక్కి ఇచ్చేస్తే... వస్తువు ధర డబ్బును వెనక్కి ఇచ్చేస్తుంది అమెజాన్. (image credit - Amazon.com)