సొంతిళ్లు అనేది ఒకప్పుడు చాలా మందికి జీవిత కల. కానీ, ఇప్పుడు చిన్న వయస్సులోనే బ్యాంకు రుణాలతో తమ కల నెరవేర్చుకుంటున్నారు. బ్యాంకులు సైతం రకరకాల లోన్లను తక్కువ వడ్డీకే ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఇంట్రస్ట్ ఓన్లీ అనే కొత్తరకమైన హోమ్‌లోన్‌కు డిమాండ్ పెరిగింది. దీని కింద రుణగ్రహీతలు పరిమిత వ్యవధిలో మాత్రమే అసలుపై వడ్డీని చెల్లించే వెసులుబాటు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇటువంటి ఇంట్రస్ట్ ఓన్లీ హోమ్ లోన్ ను ప్రారంభించింది. తన కొత్త, ప్రస్తుత క్లయింట్లకు ‘ఇంట్రస్ట్ ఓన్లీ’ హోమ్ లోన్ ఫెసిలిటీ కల్పిస్తోంది. అయితే, కేవలం రెడీ టు లివ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీల కొనుగోలుకు మాత్రమే ఈ సదుపాయాన్ని అందిస్తోంది. రూ. 35 లక్షల నుంచి రూ. 3.5 కోట్ల వరకు ఏడాది నుంచి మూడేళ్ల వ్యవధి గల హోమ్ లోన్లపై మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ కాలానికి సమానమైన నెలవారీ వాయిదా (ఈఎంఐ)ల ద్వారా వడ్డీ మాత్రమే చెల్లించవచ్చు. వ్యవధి ముగిసిన తర్వాత, హోమ్ లోన్‌ను సాధారణ లోన్ లాగా పరిగణిస్తారు. ఈఎంఐలు, లోన్ మెచ్యూరిటీ తీరే వరకు అసలు, వడ్డీ రెండింటినీ కలిగి ఉంటాయి. ఈ సదుపాయం వేరే బ్యాంకులో ఉన్న గృహ రుణాలను స్టాండర్డ్ చార్టర్డ్‌కు బదిలీ చేసే కస్టమర్లకు కూడా వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఎస్బీఐ సైతం తన ఫ్లెక్సీపే హోమ్ లోన్‌లో భాగంగా ఇటువంటి సదుపాయాన్నే అందిస్తుంది. కొన్ని ఇతర బ్యాంకులు సైతం తమ రుణ నిబంధనలను బట్టి ఇంట్రస్ట్ ఓన్లీ హోమ్ లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. రెసిడెన్షియల్ డెవలపర్లు లేదా హౌసింగ్ ప్రాజెక్ట్‌ల బిల్డర్లు కూడా ‘ఇంట్రస్ట్ ఓన్లీ’ లోన్ల కోసం బ్యాంకులతో టైఅప్ చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
రెడీ టు లివ్ ప్రాపర్టీలకు మాత్రమే ఆఫర్..స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు కస్టమర్లు రూ. 35 లక్షల నుంచి రూ.3.5 కోట్ల వరకు ఉన్న రుణ మొత్తానికి ఈ స్పెషల్ హోమ్ లోన్ సౌకర్యం పొందవచ్చు. వేతనం పొందే వ్యక్తులకు అయితే లోన్ రీపేమెంట్ గరిష్ఠ కాలవ్యవధి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వారికైతే 25 సంవత్సరాల వరకు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈఎంఐల ప్రారంభానికి ముందే వడ్డీ చెల్లించడం ద్వారా కస్టమర్లకు నగదు ఇబ్బందులను తగ్గించడంలో ఈ ఓన్లీ వడ్డీ హోమ్ లోన్ సహాయపడుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు చెబుతోంది. ఈ రెడీ టు లివ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసే వారికి ఈ ‘వడ్డీ మాత్రమే’ హోమ్ లోన్ సౌలభ్యం ప్రత్యామ్నాయంగా ఉంటుందని MyMoneyMantra.com వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ ఖోస్లా తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)