1. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్పో 2023లో కంపెనీలు తమ సరికొత్త ప్రాజెక్టుల వివరాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఫ్యూచర్ ప్రాజెక్టులను పంచుకున్నాయి. ఈ వేదికపై కియా ఇండియా కూడా ఒక లగ్జరీ వెహికల్‌ను ఆవిష్కరించింది. బుధవారం భారతదేశంలో మొదటిసారి కియా ఇండియా తన EV9 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్(EV)ను ప్రదర్శించింది. (Photo: Paras Yadav/News18.com)
2. ఈ కాన్సెప్ట్ SUV బ్యాటరీతో పనిచేస్తుంది. కియా కంపెనీ ఎలక్ట్రిక్ లైనప్‌లో ఫ్లాగ్షిప్ మోడల్‌గా ఇది నిలుస్తుంది. ఈ కారు 2025లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా భవిష్యత్తులో ఇండియాలో కియా మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసే ప్రణాళికలో ఉందని, సస్టైనబిలిటీకి ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టమైంది. (Photo: Paras Yadav/News18.com)
3. EV9 పొడవు 4,929mm, వెడల్పు 2,055mm, ఎత్తు 1,790mmతో దాదాపు రేంజ్ రోవర్ పరిమాణంలో ఉంటుంది. ఇది 3,100mm వీల్‌బేస్‌ను పొందుతుంది. కియా EV9 ఇంటీరియర్‌లో EV9 కాన్సెప్ట్ ట్విన్-స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ లేఅవుట్, స్పోక్-లెస్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. ఫిజికల్ కంట్రోల్స్ పూర్తిగా లేకపోవడంతో మినిమలిస్టిక్ డ్యాష్‌బోర్డ్‌ను అందిస్తుంది. (Photo: Paras Yadav/News18.com)
4. ఈ ఎలక్ట్రిక్ SUV చుట్టూ ఫంకీ యాంబియంట్ లైటింగ్‌తో మూడు వరుసల లేఅవుట్‌తో వస్తుంది. రెండో వరుస సీట్లను పూర్తిగా ఫ్లాట్‌గా ఫోల్డ్ చేయవచ్చు. మొదటి వరుస సీట్లు లాంజ్-టైప్ స్పేస్ కోసం చుట్టూ తిరుగుతాయి. ఆటోమేటిక్ డ్రైవింగ్ ఫీచర్లు, ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్ కంపాటబిలిటీ, ఫీచర్-ఆన్-డిమాండ్(FOD) వంటి స్పెసిఫికేషన్లను దీంట్లో అందించారు. (Photo: Paras Yadav/News18.com)
5. కియా EV9 ఫుల్ ఛార్జింగ్‌తో 540 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే అవకాశం ఉంది. ఫ్లాగ్‌షిప్‌గా మోడల్‌గా లాంచ్ కానున్న ఈ వెహికల్, ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది 350kW వరకు పాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు ఫాస్ట్ ఛార్జ్ చేయడానికి కేవలం 20 నిమిషాలు పడుతుంది. కేవలం ఆరు నిమిషాల ఛార్జింగ్‌తో కార్ 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించగలదు. హ్యుందాయ్ మోటార్ గ్రూప్, ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫారం(E-GMP) ఆధారంగా.. EV9 ఓన్ ప్రొడక్షన్ ఫార్మ్‌లో ఈ ఏడాది చివరినాటికి తయారీ ప్రారంభించే అవకాశం ఉంది. (Photo: Paras Yadav/News18.com)
6. ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయడంపై ఎలాంటి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. కియా ఇండియా.. ఎలక్ట్రిక్ మొబిలిటీలో అందించే కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయనే వివరాలను EV9 కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. కంపెనీ 2022లో లాంచ్ చేసిన EV6ని ఇండియన్ మార్కెట్లో అందిస్తోంది. కానీ ఇండియాకు ఇంపోర్టెడ్గానే వచ్చే వెహికల్. దీని ధర సుమారు రూ.60 లక్షల(ఎక్స్-షోరూమ్)గా ఉంది. (Photo: Paras Yadav/News18.com)
7. ఆటో ఎక్స్‌పోలో కియా కంపెనీ EV9 కాన్సెప్ట్‌తో పాటు KA4 MPV మోడల్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఇది కార్నివాల్ లైనప్‌లో కొత్త జనరేషన్. గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న కార్నివాల్ కంటే KA4 డిజైన్ చాలా పెద్దది. ఇందులో లగ్జరీ, ప్రీమియం లుక్‌లో దృఢంగా కనిపిస్తోంది. (Photo: Paras Yadav/News18.com)