భారత్‌లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు ట్రైన్ల (Trains)లో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. రైల్వే నెట్వర్క్ దాదాపు అన్ని నగరాలను కనెక్ట్ చేస్తుంది కాబట్టి విమానాశ్రయాలు, రన్వేలు లేని ప్రదేశాలకు కూడా రైళ్లలో వెళ్లిపోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
రైళ్లలో కిక్కిరిసేలా ప్రజలు ప్రయాణాలు చేయడానికి మరో కారణం ఏమిటంటే, ఎయిర్‌వేస్‌తో పోలిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే ఎక్కువ లగేజీ (Luggage)ని రైళ్లలో తీసుకెళ్లొచ్చు. అలాగని ఇకపై మీకు నచ్చినట్టు ఎక్కువ లగేజీ (Unlimited Luggage)ని తీసుకెళ్లటం కుదరదు. రైల్వే శాఖ (Indian Railways) తాజాగా నిర్ణయించిన లిమిట్‌కు మించి మీరు లగేజీని తీసుకెళ్తే అదనపు ఛార్జీలు (Additional Charges) చెల్లించాల్సి ఉంటుంది. మరి లగేజ్‌పై రైల్వే శాఖ కొత్తగా తీసుకొచ్చిన లిమిట్ ఏంటి? అదనపు ఛార్జీలు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
చాలా మంది ప్రయాణికులు రైలు ప్రయాణాల్లో బరువైన బ్యాగులను తమ వెంట తీసుకెళ్లడాన్ని రైల్వే అధికారులు ఎప్పటినుంచో గమనిస్తున్నారు. దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగడంతో పాటు మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయని ఇండియన్ రైల్వే గుర్తించింది. అందుకే ఈ లగేజ్ సైజును అదుపులో ఉంచడానికి, అదనపు ఛార్జీలను తీసుకొచ్చింది. దీని గురించి తాజాగా ఒక ప్రకటన కూడా చేసింది.
“అధిక సామానుతో రైలు ప్రయాణం చేస్తే... జర్నీలో వచ్చే హ్యాపీనెస్ తగ్గుతుంది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అదనపు లగేజీని తీసుకెళ్లవద్దు. ఒకవేళ మీ వద్ద అదనపు బ్యాగేజీ ఉంటే, పార్శిల్ కార్యాలయానికి వెళ్లి లగేజీని బుక్ చేసుకోండి' అని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. అయితే ప్యాసింజర్లు తమ లగేజీని బయలుదేరడానికి కనీసం 30 నిమిషాల ముందు బుకింగ్ స్టేషన్‌లోని లగేజీ ఆఫీస్‌లో అందించాల్సి ఉంటుంది. ప్యాసింజర్లు తమ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలోనే తమ లగేజీని కూడా బుక్ చేసుకోవచ్చు.