1. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారికి అలర్ట్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) కొత్త రూల్ ప్రకటించింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ (IT Returns Filing) చేసినవారు 30 రోజుల్లో ఇ-వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలని తెలిపింది. గతంలో ఈ గడువు 120 రోజులు ఉండేది. ఈ టైమ్ లిమిట్‌ను 30 రోజులకు తగ్గించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇందుకు సంబంధించి ఆగస్ట్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ అమలులోకి వచ్చిన తేదీన లేదా ఆ తర్వాత రిటర్న్ ఫైల్ చేసేవారు ఇ-వెరిఫికేషన్ లేదా ITR-V సమర్పించడానికి 30 రోజుల గడువు మాత్రమే ఉంటుందని సీబీడీటీ తెలిపింది. కాబట్టి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినవారు 30 రోజుల్లో ఇ-వెరిఫై పూర్తి చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ఇ-వెరిఫై చేయడం తప్పనిసరి. ఆగస్ట్ 1 కన్నా ముందు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినవారికి 120 రోజుల గడువు ఉంది. అంటే జూలై 31 వరకు ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేశారో వారు 120 రోజుల్లో ఇ-వెరిఫై పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినవారు తమకు ఇచ్చిన గడువులోగా ఇ-వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే అందుకు లేట్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐటీఆర్ ఇ-వెరిఫై చేయనివారు స్పీడ్ పోస్టు ద్వారా ఐటీఆర్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. సీబీడీటీ సూచించిన ఫార్మాట్లో ఐటీఆర్ వెరిఫికేషన్ ఫామ్ పూర్తి చేసి Centralised Processing Centre, Income Tax Department, Bengaluru - 560500, Karnataka అడ్రస్‌కు స్పీడ్ పోస్టులో పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసే గడువు జూలై 1న ముగిసిన సంగతి తెలిసిందే. చివరి రోజే 72.42 లక్షల ఐటీఆర్ ఫైలింగ్స్ జరిగినట్టు సీబీడీటీ ప్రకటించింది. 2022 జూలై 31 నాటికి 5.83 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేశారు. గతేడాది ఐటీ రిటర్న్స్ లెక్క చూస్తే డిసెంబర్ 31 నాటికి 5.9 కోట్ల మంది, 2022 మార్చి 15 నాటికి 6.3 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. గడువు తర్వాత రిటర్న్స్ ఫైల్ చేసేవారు ఛార్జీలు చెల్లించడంతో పాటు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కోల్పోవాల్సి ఉంటుంది. పెనాల్టీ ఛార్జీల వివరాలు చూస్తే గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసేవారి వార్షికాదాయం రూ.5,00,000 లోపు ఉంటే రూ.1,000 జరిమానా చెల్లించాలి. వార్షికాదాయం రూ.5,00,000 కన్నా ఎక్కువగా ఉంటే రూ.5,000 జరిమానా చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. నేటి నుంచి రిటర్న్స్ ఫైల్ చేసేవారు వారి వార్షికాదాయాన్ని బట్టి రూ.1,000 లేదా రూ.5,000 జరిమానా చెల్లించడం తప్పనిసరి. కనీస మినహాయింపు లిమిట్ రూ.2,50,000 ఉన్నవారు ఐటీఆర్ ఫైల్ చేస్తే ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ లిమిట్ వృద్ధులకు రూ.3,00,000 నుంచి రూ.5,00,000 మధ్య ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇక రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఏవైనా పన్నులు చెల్లించాల్సి ఉంటే నెలకు 1 శాతం చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి పన్నులు రూ.10,000 లోపు ఉన్నవారికే ఇది వర్తిస్తుంది. ఒకవేళ పన్నులు రూ.10,000 దాటి, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించనట్టైతే పెనాల్టీ నెలకు 1 శాతం చొప్పున వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)