1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవల ఫేక్ మెసేజెస్ ఎక్కువగా వస్తున్నాయి. మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని, మీ యోనో అకౌంట్ పనిచేయదని, మీ అకౌంట్ యాక్టీవ్‌గా ఉండాలంటే వివరాలు అప్డేట్ చేయాలన్నది ఆ మెసేజెస్ సారాంశం. వీటిలో ఎక్కువగా పాన్ కార్డ్ అప్డేట్ (PAN Card Update) చేయాలని మెసేజెస్ వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇలాంటి మెసేజెస్ ఫేక్ అని ఎస్బీఐ ఇప్పటికే అనేక సార్లు వెల్లడించింది. అయితే ఇలాంటి మెసేజెస్ పదేపదే ఎస్బీఐ ఖాతాదారులకు వస్తున్నాయి. దీంతో భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం అయిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Factcheck) నిజ నిర్ధారణ చేసి ఎస్బీఐ ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎస్బీఐ పేరుతో ఫేక్ మెసేజెస్ వస్తున్నాయని, పాన్ కార్డ్ వివరాలు అప్డేట్ చేయకపోతే యోనో అకౌంట్ బ్లాక్ చేస్తామని మెసేజ్‌లో సైబర్ నేరగాళ్లు భయపెడుతున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఇలాంటి ఎస్ఎంఎస్లు, ఇమెయిల్స్‌కు స్పందించకూడదని, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాన్ కార్డ్ వివరాలు తెలపకూడదని, పదేపదే ఇలాంటి మెసేజెస్ వస్తే report.phishing@sbi.co.in మెయిల్ ఐడీకి ఫిర్యాదు చేయాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కోరుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎస్ఎంఎస్లో వచ్చని లింక్ క్లిక్ చేస్తే మీ పాన్ నెంబర్‌తో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేయాలని కోరతారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాన్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, సీవీవీ లాంటి డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఆ తర్వాత మీ ఖాతాలో ఉన్న డబ్బులు కొల్లగొట్టేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)