#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాఇండియా న్యూస్జాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాఇండియా న్యూస్జాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames HOME » PHOTOGALLERY » BUSINESS » ALERT FOR SBI CUSTOMERS STATE BANK OF INDIA WARNS ABOUT CYBER CRIMES AND ASKS CUSTOMERS TO AVOID THESE 5 MISTAKES SS SBI Alert: బ్యాంకులో అకౌంట్ ఉందా? ఈ 5 తప్పులు చేయొద్దు SBI Alert | టెక్నాలజీతో బ్యాంకింగ్ సేవలు సులువుగా అయిపోతున్నాయి కానీ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. మీకు ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉన్నట్టైతే మోసపోకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. News18 Telugu | December 9, 2020, 6:40 PM IST 1/ 7 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. కస్టమర్లకు ఎస్బీఐ ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజుల్లో షాపింగ్ నుంచి ఇతర పేమెంట్స్ వరకు కార్డులను, డిజిటల్ పేమెంట్ పద్ధతుల్ని ఉపయోగిస్తారు కస్టమర్లు. బ్యాంకింగ్ మోసాలను దృష్టిలో పెట్టుకొని తమ కస్టమర్లను ఎస్బీఐ హెచ్చరిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 7 2. ఎలాంటి మోసాలు జరుగుతాయో, కస్టమర్లు ఏ విధంగా మోసపోయే అవకాశం ఉంటుందో గుర్తించి ఎస్బీఐ అప్రమత్తం చేస్తోంది. మోసపోకుండా తమ అకౌంట్లను ఎలా జాగ్రత్తగా సూచిస్తోంది. ప్రధానంగా 5 తప్పులు చేయకూడదని హెచ్చరిస్తోంది. ఆ 5 తప్పులు ఏవో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం) 3/ 7 3. మీ ఫోన్కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్-OTP, పిన్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్ నెంబర్, ఆ కార్డుల వెనుక ఉండే సీవీవీ నెంబర్స్ ఎవరికీ చెప్పకూడదు. చాలావరకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఈ వివరాలు అడుగుతుంటారు. ఎవరైనా మీకు కాల్ చేసి ఈ వివరాలు అడిగినట్టైతే అస్సలు చెప్పకూడదు. (ప్రతీకాత్మక చిత్రం) 4/ 7 4. ఫోన్లో బ్యాంకు అకౌంట్ వివరాలు సేవ్ చేయకూడదు. ఫోన్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అకౌంట్ వివరాలు చూడొచ్చని సేవ్ చేయడం చాలామందికి అలవాటు. ఆ అలవాటే చివరకు కొంప ముంచుతుంది. అందుకే ఫోన్లో బ్యాంకు అకౌంట్ నెంబర్లు, కార్డు నెంబర్లు, పాస్వర్డ్స్ లాంటివి సేవ్ చేయకూడదు. అకౌంట్ వివరాలు కనిపించే ఫోటోలు కూడా తీయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 7 5. ఏటీఎం కార్డు వివరాలు ఎవరికీ వెల్లడించొద్దు. మీ ఏటీఎం కార్డు మీరే ఉపయోగించాలి. కార్డు ఎవరికీ ఇవ్వకూడదు. కార్డు వివరాలు కూడా ఎవరికీ చెప్పకూడదు. దీని వల్ల బ్యాంక్ అకౌంట్ వివరాలు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) 6/ 7 6. మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నట్టైతే మీ సొంత వైఫై మాత్రమే ఉపయోగించాలి. లేదా మొబైల్ డేటా ఉపయోగించాలి. అంతే తప్ప పబ్లిక్ ఇంటర్నెట్ ఉపయోగించకూడదు. ఎక్కడో వైఫై ఫ్రీగా వస్తోందని లావాదేవీలు జరిపితే మీ బ్యాంకు వివరాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం) 7/ 7 7. మీ యూజర్ ఐడీ, పిన్, పాస్వర్డ్, సీవీవీ, ఓటీపీ, వీపీఏ, యూపీఐ లాంటి వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI సిబ్బంది, ఇతర బ్యాంకు సిబ్బంది ఎవరూ అడగరు. ఎవరైనా ఈ వివరాలు అడుగుతున్నట్టైతే మిమ్మల్ని మోసం చేయడానికేనని గుర్తించండి. (ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుAndhra Pradesh: విశాఖ స్టీల్ ప్లాంట్ లో మెడికల్ ఆక్సిజన్ ఎలా తయారవుతుందో తెలుసా? ఆక్సిజన్ కు మెడికల్ ఆక్సిజన్ కు తేడా ఏంటి?Lockdown: మహారాష్ట్రలో ఉన్న తెలుగువారు ఏం చేయవచ్చు? సొంతూళ్లకు ఎలా వెళ్లాలి?Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో చెత్త రికార్డు.. అంతా రాజమౌళి వల్లే అంటున్న ఫ్యాన్స్..FIR on pigeon : పావురంపై కేసు..గుఢాచార్యం కేసులో అరెస్ట్.. Top Stories Lockdown: మహారాష్ట్రలో ఉన్న తెలుగువారు ఏం చేయవచ్చు? సొంతూళ్లకు ఎలా వెళ్లాలి? FIR on pigeon : పావురంపై కేసు..గుఢాచార్యం కేసులో అరెస్ట్.. Jabardasth Rakesh: జబర్దస్త్ రాకేష్ వార్నింగ్.. పిల్లల్ని మోసం చేస్తున్నాడంటూ ఆరోపణలు.. Maharashtra Lokdown: మహారాష్ట్రలో లాక్డౌన్.. వీటికి మాత్రమే అనుమతి.. కొత్త నిబంధనలు ఇవే CM KCR: సీఎం కేసీఆర్ సి.టి. స్కానింగ్.. పరీక్షల తర్వాత డాక్టర్లు ఏమన్నారంటే...
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames