1. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమరా? ఏటీఎం కార్డు ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? నాలుగైదు రోజులకు ఓసారి ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుంటారా? అయితే మీరు ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయొచ్చు. గతంలో ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా (Cash Withdrawal) చేయాలంటే ఏటీఎం కార్డు తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో కార్డు లేకుండానే సులువుగా నగదు తీసుకోవచ్చు. ఎస్బీఐ ఈ సర్వీస్‌ను చాలాకాలం క్రితమే ప్రారంభించింది. అయితే ఇప్పటికీ ఈ సర్వీస్ ఉపయోగించుకుంటున్నవారు తక్కువే. ఏటీఎం కార్డుతోనే డబ్బులు డ్రా చేస్తుంటారు. కానీ డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం కార్డు అవసరమే లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు ఏటీఎం కార్డు ఉపయోగించకుండా నగదు తీసుకోవాలంటే వారి స్మార్ట్‌ఫోన్‌లో యోనో ఎస్బీఐ మొబైల్ అప్లికేషన్ (Yono SBI App) ఉండాలి. స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు... జేబులో ఏటీఎం కార్డు అవసరం లేదు. యోనో యాప్ ద్వారా కనీసం రూ.500 నుంచి రూ.10,000 వరకు విత్‌డ్రా చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇందుకోసం ఎస్బీఐ కస్టమర్లు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Yono SBI App డౌన్లోడ్ చేయాలి. తమ వివరాలతో రిజిస్టర్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 6 అంకెల పిన్‌తో లాగిన్ కావాలి. ముందే రిజిస్ట్రేషన్ చేసిన కస్టమర్లు 6 అంకెల పిన్ ఎంటర్ చేస్తే చాలు. లాగిన్ అయిన తర్వాత Request YONO cash ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ప్రతీ ఎస్బీఐ ఏటీఎంలో ఈ సదుపాయం లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎస్బీఐ ఏటీఎంలో యోనో క్యాష్ సదుపాయం ఉంటేనే ఈ విధంగా డబ్బులు డ్రా చేయొచ్చు. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో యోనో క్యాష్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోండి. ఈ సర్వీస్ ద్వారా డబ్బులు డ్రా చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)