2. ఉదాహరణకు భారతీయ రైల్వే యాక్ట్ 1989 లోని సెక్షన్ 139 ప్రకారం ఒక మహిళా ప్రయాణికురాలు పురుషుల తోడు లేకుండా ఒంటరిగా లేదా తన బిడ్డతో ప్రయాణిస్తుంటే, ఆమెకు రైల్వే పాస్ లేదా టికెట్ లేదన్న కారణంతో రాత్రి సమయంలో రైలు నుంచి దిగమని రైల్వే సిబ్బంది ఆదేశించకూడదు. ఒకవేళ రైల్వే అధికారుల దగ్గర మహిళా కానిస్టేబుల్ ఉన్నప్పుడు మాత్రమే ఆ మహిళను బయటకు వెళ్లమని కోరవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇవి కాకుండా భారతీయ రైల్వే మహిళలకు పలు సదుపాయాలను కల్పిస్తోంది. రైల్వే బెర్తుల్లో రిజర్వేషన్ కల్పిస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే స్లీపర్ క్లాస్ బోగీల్లో ఆరు బెర్తులు మహిళలకు కేటాయించింది. గరీబ్ రథ్, రాజధాని, దురంతో రైళ్లల్లో థర్డ్ క్లాస్ బోగీల్లో, ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఆరు బెర్తుల్ని కూడా కేటాయించింది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ బెర్తుల్ని కేటాయిస్తోంది రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక లోయర్ బెర్తుల్లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. స్లీపర్ క్లాసులో ప్రతీ కోచ్‌లో ఆరు నుంచి ఏడు లోయర్ బెర్తులు, థర్డ్ ఏసీ బోగీల్లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్తులు, సెకండ్ ఏసీలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్తులు కేటాయించడం విశేషం. ఈ బెర్తుల్ని వృద్ధులు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణుల కోసం ప్రత్యేకంగా కేటాయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక మహిళల భద్రత, రక్షణ కోసం నిత్యం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మహిళా సిబ్బందితో రైళ్లల్లో తనిఖీలు చేయిస్తోంది. గవర్నమెంట్ రైల్వే పోలీస్, డిస్ట్రిక్ట్ పోలీస్ సహాయం కూడా తీసుకుంటోంది. ఇక ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో మేరీ సహేలీ కార్యక్రమాన్ని దేశమంతా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు రైలు ఎక్కిన స్టేషన్ నుంచి గమ్యస్థానం చేరుకునే వరకు భద్రతను అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)