1. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు తగ్గట్లేదు. వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. దక్షిణాఫ్రికాలో 2021 నవంబర్ 24న బయటపడ్డ ఓమిక్రాన్ వేరియంట్‌తో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తం అవుతున్నాయి. ఓమిక్రాన్‌ను అడ్డుకోవడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పటికే భారత ప్రభుత్వం ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికుల రాకపోకలపై నిఘా పెట్టేందుకు గైడ్‌లైన్స్ ప్రకటించింది. విమాన ప్రయాణికులపై ఆంక్షలు కూడా ఉన్నాయి. మరోవైపు భారతీయ రైల్వే కూడా రైల్వే ప్రయాణికుల విషయంలో గైడ్‌లైన్స్ కఠినతరం చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్ల స్టాక్ కావాల్సినంత ఉండేలా చూసుకుంటోంది భారతీయ రైల్వే. పీపీఈ కిట్స్‌తో పాటు పరీక్షలు జరపడానికి కావాల్సిన కిట్స్‌ని సమకూర్చుకుంటోంది. ఐసీయూ బెడ్స్ కూడా సిద్ధం చేస్తున్నామని, ప్రతీ రైల్వే ఉద్యోగి వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని భారతీయ రైల్వే తెలిపింది. ఈ మేరకు అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైల్వే బోర్డ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ కే శ్రీధర్ News18 తో మాట్లాడుతూ అన్ని రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్స్‌కు ఆదేశాలు జారీ చేశామని, ఓమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడం కోసం భారతీయ రైల్వే అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటోందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఎస్ఏ ప్లాంట్స్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్లు, యూనిట్ హెడ్స్‌ని ఆయన కోరారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. వైద్య సదుపాయాలను సమీక్షించాలని, ఎక్కడైనా ఏవైనా అవసరాలు ఉంటే వెంటనే కావాల్సినవి సిద్ధం చేయాలని రైల్వే బోర్డ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ కే శ్రీధర్ తెలిపారు. వైద్య పరికరాలు సమకూర్చుకోవడంతో పాటు కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించడం కోసం ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. (ప్రతీకాత్మక చిత్రం)