2. రైల్వే అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బోగీల్లో అపరిశుభ్రమైన వాతావరణం ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే అధికారులు కొత్త ఆలోచన చేశారు. రైల్వే బోర్డ్ ఛైర్మన్, జనరల్ మేనేజర్, డీఆర్ఎం లాంటి ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైళ్లల్లో పరిశుభ్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు రైల్వే ఉన్నతాధికారులంతా అధికారుల హోదాలో కాకుండా సాధారణ ప్రయాణికుల్లా రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. రైల్వే అధికారులు నేరుగా తనిఖీలకు వస్తే స్థానిక సిబ్బంది ముందే రైళ్లను శుభ్రంగా మార్చేస్తారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించడానికి రైల్వే అధికారులు ఇలా సాధారణ ప్యాసింజర్లలా రైలెక్కుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైల్వే అధికారులు జనరల్, స్లీపర్ క్లాస్ రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. రైలు బోగీలు శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నారు. రైళ్లల్లో శుభ్రత, కేటరింగ్, లైటింగ్, టాయిలెట్లు ఎలా ఉన్నాయో స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు రైల్వే ఉన్నతాధికారులు 544 రైళ్లలో ఇలా ఆకస్మిక తనిఖీ చేశారు. రైల్వే అధికారులే నేరుగా ప్రయాణికుల్లా జర్నీ చేయడం ఇదే మొదటిసారి. (ప్రతీకాత్మక చిత్రం)
5. స్వచ్ఛ్ భారత్, స్వచ్ఛ్ రైల్ కార్యక్రమాల్లో భాగంగా అన్ని జోన్లలో జూన్ 24 నుంచి రైల్వే అధికారులు రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. ప్రయాణించి రైళ్లల్లో శుభ్రతను పరిశీలించడం మాత్రమే కాదు, ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిసిన ప్రతీచోటా అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)