1. ఇండియాలో ప్రస్తుతం అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ కార్డ్‌లను (Credit Cards) అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. క్రెడిట్ కార్డ్‌ను సక్రమంగా వినియోగించడం తెలిస్తే చాలా ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్లను క్విక్‌గా చేయవచ్చు. క్రెడిట్ కార్డ్‌లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌ని ఉపయోగించి ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు. అదే డెబిట్ కార్డ్‌లు బ్యాంక్ అకౌంట్లకు లింక్ అయి ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రతి ట్రాన్సాక్షన్‌కు తగిన మొత్తాన్ని అకౌంట్లోని నుంచి మనీ డెబిట్ చేస్తాయి. అందించిన లిమిట్‌తో అవసరమైన పేమెంట్స్ చేయడం, నిర్ణీత కాలం తర్వాత సులువుగా తిరిగి చెల్లించే అవకాశం, వివిధ ఆఫర్లతో ప్రస్తుతం క్రెడిట్ కార్డ్‌లు చాలా పాపులర్ అయ్యాయి. తాజాగా ప్రముఖ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఆర్సీటీసీ (IRCTC)తో కలిసి ఓ క్రెడిట్ కార్డ్‌ను లాంచ్ చేసింది. ఈ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
3. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, IRCTCతో కలిసి.. హెచ్డీఎఫ్సీ ఐఆర్సీటీసీ రూపే క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసింది. ఈ కార్డ్ తరచూ రైలు ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడుతుంది. వివిధ కేటగిరీలకి చెందిన ఇన్సెంటివ్‌లు లభిస్తాయి. అదే విధంగా అత్యధిక రివార్డులు, ట్రావెలింగ్ ప్రోత్సాహకాలు పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్‌కు యాన్యువల్ ఛార్జీ రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. హెచ్డీఎఫ్సీ ఐఆర్సీటీసీ రూపే క్రెడిట్ కార్డ్ తీసుకొన్న వారికి వెల్కమ్ బెనిఫిట్స్ ఉన్నాయి. కార్డ్ పొందిన మొదటి 30 రోజుల్లో చేసే మొదటి పేమెంట్‌పై ఈ కార్డు హోల్డర్‌కు వెల్కమ్ ఆఫర్ కింద రూ.500 అమెజాన్ వోచర్ లభిస్తుంది. అమెజాన్‌లో కొనుగోళ్లపై ఈ రూ.500 డిస్కౌంట్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. వివిధ కేటగిరీల పేమెంట్స్‌పై హెచ్డీఎఫ్సీ ఐఆర్సీటీసీ రూపే క్రెడిట్ కార్డ్ రివార్డు రేట్లు అందిస్తుంది. IRCTC రిజర్వేషన్ కోసం ఖర్చు చేసే ప్రతి రూ.100పై ఐదు క్యాష్ పాయింట్లను అందిస్తుంది. అదే విధంగా HDFC స్మార్ట్ బై ఉపయోగించుకుని టిక్కెట్లు కొంటే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇతర పేమెంట్స్‌పై ప్రతి రూ.వందకి ఒక క్యాష్ పాయింట్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ కార్డు వినియోగించడం ద్వారా పొందిన రివార్డు పాయింట్లను వివిధ సర్వీసులు, వస్తువుల కొనుగోలుకు వాడుకోవచ్చు. IRCTC వెబ్సైట్లో టిక్కెట్ రిజర్వేషన్ కోసం చేసిన ప్రతి పేమెంట్‌కు లభించిన ఒక్క క్యాష్ పాయింట్ ఒక రూపాయితో సమానం. విమాన టిక్కెట్లు, హోటల్స్, గిఫ్ట్ కార్డులు కొరకు చేసిన పేమెంట్స్‌పై వచ్చిన ప్రతి ఒక్క క్యాష్ పాయింట్ 30 పైసలు విలువ చేస్తుంది. స్టేట్మెంట్ బ్యాలెన్స్‌పై ప్రతి ఒక్క క్యాష్ పాయింట్ 30 పైసలుతో సమానం. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ హెచ్డీఎఫ్సీ ఐఆర్సీటీసీ రూపే క్రెడిట్ కార్డ్ ఉన్న యూజర్లు ఏడాదికి నాలుగు ఫ్రీ రైల్వేస్టేషన్ లాంజ్ యాక్సెస్‌లను పొందుతారు. మూడు నెలలకి ఒకటి చొప్పున లాంజ్ యాక్సెస్‌లు లభిస్తాయి. ఈ క్రెడిట్ కార్డ్‌లో రూ.1.5 లక్ష అంతకన్నా ఎక్కువ వినియోగిస్తే రూ.499 రెన్యువల్ ఛార్జీ రద్దు అవుతుంది. HDFC IRCTC క్రెడిట్ కార్డు ఉపయోగించుకుని రూ.400 నుంచి రూ.5000 టిక్కెట్లు కొనుగోలు చేస్తే ట్రాన్సాక్షన్ ఫీజు కూడా రద్దు అవుతుంది. రూ.400- రూ.5000 ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ పై విధించే సర్ ఛార్జీలో 1 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)