1. ఇటీవల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) రూల్స్ వివాదాస్పదం అవుతున్నాయి. లేటెస్ట్గా మరో రూల్ చర్చనీయాంశం అవుతోంది. రైలు టికెట్లు బుక్ చేసి, కన్ఫామ్ అయిన తర్వాత క్యాన్సిల్ చేస్తే జీఎస్టీ చెల్లించాలి. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను ఆగస్ట్ 3న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ట్యాక్స్ రీసెర్చ్ యూనిట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం టిక్కెట్ల బుకింగ్ అనేది ఒక ‘కాంట్రాక్టు’ అని, దీని కింద సర్వీస్ ప్రొవైడర్ అయిన ఐఆర్సీటీసీ లేదా భారతీయ రైల్వే కస్టమర్‌కు సేవలను అందిస్తామని హామీ ఇస్తుందని, ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేస్తే జీఎస్టీ వర్తిస్తుందని ఆ సర్క్యులర్ సారాంశం. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ టికెట్ క్యాన్సిల్ చేస్తే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. రైలు టికెట్లకు మాత్రమే కాదు ఫ్లైట్ టికెట్స్, హోటల్ అకామడేషన్ క్యాన్సిల్ చేసినా ఇదే లాజిక్ వర్తిస్తుంది. ప్రధాన సేవకు వర్తించేలా జీఎస్టీ, క్యాన్సలేషన్ ఛార్జీలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితిలో టిక్కెట్‌ను రద్దు చేసినా రద్దు ఛార్జీలపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ప్రకారం టికెట్ క్యాన్సలేషన్ ఒప్పంద ఉల్లంఘన కిందకు వస్తుందని, అందుకే క్యాన్సలేషన్ ఛార్జీలతో పాటు జీఎస్టీ చెల్లించాలి. ప్రయాణికులు లేదా సేవల్ని ఉపయోగిస్తున్నవారు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు కాబట్టి సర్వీస్ ప్రొవైడర్‌కు క్యాన్సలేషన్ ఛార్జీ రూపంలో కొంత మొత్తం చెల్లించాలి. క్యాన్సలేషన్ ఛార్జీ ఒప్పంద ఉల్లంఘన కాదు కాబట్టి దానిపైన జీఎస్టీ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ లెక్కన రైల్వే ప్రయాణికులు ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ ట్రైన్ టికెట్ బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రూ.240 క్యాన్సలేషన్ ఛార్జీ వర్తిస్తుంది. దీనిపై జీఎస్టీ కలిపి మొత్తం రూ.252 ఛార్జీ చెల్లించాలి. సెకండ్ స్లీపర్ క్లాస్ సహా ఇతర క్లాసులకు ఇది వర్తించదు. ఇక ఫ్లైట్ టికెట్లకు ఇవే జీఎస్టీ రూల్స్ వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. భారతీయ రైల్వే టికెట్ క్యాన్సలేషన్ రూల్స్ చూస్తే రైలు బయల్దేరడానికన్నా 48 గంటలు లేదా అంతకన్నా ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే రూ.240 క్యాన్సలేషన్ ఛార్జీ, 48 గంటల నుంచి 12 గంటల మధ్య క్యాన్సిల్ చేస్తే 25 శాతం, 12 గంటల నుంచి 4 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేస్తే 50 శాతం క్యాన్సలేషన్ ఛార్జీలు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)