1. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోదు. ఎప్పటికప్పుడు నో యువర్ కస్టమర్ (KYC) వివరాలు అప్డేట్ చేయడం తప్పనిసరి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం బ్యాంకు కస్టమర్లు అందరూ తమ కేవైసీ వివరాలను బ్యాంకులో అప్డేట్ చేస్తూ ఉండాలి. లేకపోతే అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేయడమో లేదా బ్లాక్ చేయడమో తప్పదు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అందుకే ఖాతాదారులు తమ కేవైసీ వివరాలు అప్డేట్గా ఉన్నాయో లేదో తెలుసుకొని, బ్యాంకులో కేవైసీ అప్డేట్ (KYC Update) చేయిస్తూ ఉండాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ బ్యాంకు కస్టమర్లను కేవైసీ అప్డేట్ చేయాలని కోరుతోంది. 2022 డిసెంబర్ 12 లోగా కేవైసీ అప్డేట్ చేయించకపోతే అకౌంట్ కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2022 సెప్టెంబర్ 30 లోగా కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉందని, ఇప్పటికే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు పలు నోటీసులు, ఎస్ఎంఎస్ పంపామని, 2022 డిసెంబర్ 12 లోగా మీ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ అప్డేట్ చేయాలని, లేకపోతే అకౌంట్ కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయని బ్యాంకు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ అప్డేట్ చేయొచ్చు. లేదా ఇమెయిల్ ద్వారా కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే కాదు, దాదాపు అన్ని బ్యాంకులకు కేవైసీ అప్డేట్ ప్రాసెస్ దాదాపుగా ఇలాగే ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు కస్టమర్లు తమ కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలు, అనుమానాస్పద కార్యకలాపాలు, పెద్ద మొత్తంలో నగదు ట్రాన్సాక్షన్స్ లాంటివాటిపై నిఘా పెట్టాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. అందులో భాగంగా కస్టమర్ల కేవైసీ వివరాలు అప్డేట్గా ఉండేలా బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. కస్టమర్ల ఐడెంటిటీని గుర్తించేందుకు కేవైసీని ఉపయోగిస్తాయి బ్యాంకులు. (ప్రతీకాత్మక చిత్రం)
8. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు తమ కేవైసీ పెండింగ్‌లో ఉందో లేదో తెలుసుకోవడానికి వారి బ్రాంచ్‌కు వెళ్లొచ్చు. లేదా కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో రీ-కేవైసీకి అవకాశం ఇవ్వాలని ఇటీవల ఆర్బీఐ తెలిపిన సంగతి తెలిసిందే. కాబట్టి ఆన్లైన్లో రీ-కేవైసీ చేయించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)