1. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan) పథకానికి సంబంధించిన 11వ ఇన్స్టాల్మెంట్ మే 31న విడుదలైంది. 10 కోట్లకు పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లు విడుదల చేసింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2,000 ఇన్స్టాల్మెంట్ పొందాలంటే ఇకేవైసీ చేయించడం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ 11వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు జమ అయ్యాయి. 12వ ఇన్స్టాల్మెంట్ పొందాలన్నా ఇకేవైసీ తప్పనిసరి. త్వరలో విడుదల కాబోయే పీఎం కిసాన్ స్కీమ్ 12వ ఇన్స్టాల్మెంట్ పొందాలనుకునే రైతులు వెంటనే ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. గతంలో కొంతకాలం పాటు ఆన్లైన్ ఇకేవైసీ ప్రాసెస్ నిలిపివేసినా ప్రస్తుతం పీఎం కిసాన్ వెబ్సైట్లో ఇకేవైసీ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆన్లైన్లో ఇకేవైసీ చేయాలనుకునే రైతులు ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో eKYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇ-కేవైసీ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆఫ్‌లైన్‌లో పీఎం కిసాన్ కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలంటే సమీపంలో ఉన్న CSC సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ పీఎం కిసాన్ అకౌంట్‌కు ఆధార్ అప్డేట్ చేయించాలి. బయోమెట్రిక్స్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కేవైసీ ఫామ్ పూర్తి చేసి ఇవ్వాలి. కేవైసీ ప్రాసెస్ పూర్తైన తర్వాత రైతుల మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. కేంద్ర ప్రభుత్వం 2019లో బడ్జెట్ సమయంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించింది. 2018 డిసెంబర్ నుంచి పీఎం కిసాన్ స్కీమ్‌ను అమలు చేస్తామని తెలిపింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం లభిస్తుంది. రూ.2,000 చొప్పున మూడు ఇన్స్టాల్మెంట్స్లో ఏటా రూ.6,000 జమ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇప్పటివరకు 11 ఇన్స్టాల్మెంట్స్ జమ అయ్యాయి. ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్య 12వ ఇన్స్టాల్మెంట్, డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య 13వ ఇన్స్టాల్మెంట్ విడుదల చేస్తుంది. పీఎం కిసాన్ స్కీమ్‌లో అర్హులైన రైతులను గుర్తించడంతో పాటు, మోసాలు అడ్డుకోవడం కోసం రేషన్ కార్డ్ వివరాలను కూడా తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)