1. పీఎం కిసాన్ పథకం 11వ ఇన్స్టాల్మెంట్ (PM Kisan Installment) కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 11వ ఇన్స్టాల్మెంట్ విడుదల చేయనుంది. అయితే ఈసారి రైతులందరికీ 11వ ఇన్స్టాల్మెంట్ (11th Installment) లభించదు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి వాయిదాను ఇంకొన్ని రోజుల్లో విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
2. పీఎం కిసాన్ డబ్బులు పొందాలనుకుంటే రైతులు తప్పనిసరిగా ఇకేవైసీ చేయించాలి. ఈ విషయాన్ని పీఎం కిసాన్ వెబ్సైట్లో వెల్లడించింది ప్రభుత్వం. 2022 మే 31 లోగా పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఇకేవైసీ పూర్తి చేయాలి. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈసారి పీఎం కిసాన్ డబ్బులు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇప్పటికే లక్షలాది మంది రైతులు ఇకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ రైతులు స్టేటస్ చెక్ చేయొచ్చు. స్టేటస్‌లో ‘FTO is generated and Payment confirmation is pending’ అని కనిపిస్తే వెరిఫికేషన్ పూర్తైనట్టే. కాబట్టి వారికి పీఎం కిసాన్ 11వ ఇన్స్టాల్మెంట్ లభిస్తుంది. ఇకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఇప్పటివరకు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తిచేయని రైతులు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇకేవైసీ పూర్తి చేస్తేనే వారికి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. ప్రస్తుతం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ లో ఇ-కేవైసీ చేయొచ్చు. ఇందుకోసం రైతులు ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. హోమ్ పేజీలో eKYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. మీ ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇ-కేవైసీ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)