1. ఎల్ఐసీ ఐపీఓలో పాలసీహోల్డర్లకు ప్రత్యేక కోటా ప్రకటించింది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC). ఏఏ పాలసీలకు ఎల్ఐసీ ఐపీఓలో (LIC IPO) కోటా వర్తించదన్న విషయంలో గందరగోళం నెలకొంది. గ్రూప్ పాలసీలు ఉన్నవారికి పాలసీహోల్డర్ కోటా వర్తించదని ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో (DRHP) వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎల్ఐసీ న్యూ వన్ ఇయర్ రెన్యువబల్ గ్రూప్ టర్మ్ అష్యూరెన్స్ ప్లాన్ 1, ఎల్ఐసీ న్యూ వన్ ఇయర్ రెన్యువబల్ గ్రూప్ టర్మ్ అష్యూరెన్స్ ప్లాన్ 2, ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం గ్రూప్ ఇన్స్యూరెన్స్, ఎల్ఐసీ గ్రూప్ క్రెడిట్ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఎల్ఐసీ న్యూ వన్ ఇయర్ రెన్యువబల్ గ్రూప్ మైక్రో టర్మ్ అష్యూరెన్స్ ప్లాన్, ఎల్ఐసీ న్యూ గ్రూప్ గ్రాట్యుటీ క్యాష్ అక్యుములేషన్ ప్లాన్, ఎల్ఐసీ న్యూ గ్రూప్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ప్లాన్, ఎల్ఐసీ న్యూ గ్రూప్ సూపర్ యాన్యుషన్ క్యాష్ అక్యుములేషన్ ప్లాన్, ఎల్ఐసీ గ్రూప్ ఇమ్మీడియెట్ యాన్యుటీ, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీలు ఉన్నవారికి ఐపీఓలో పాలసీహోల్డర్ కోటా వర్తించదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ పాలసీలు ఉన్నవారు ఎవరూ ఎల్ఐసీ ఐపీఓలో పాలసీహోల్డర్ కోటాకు అర్హులు కాదు. మిగతా పాలసీలు ఉన్నవారు పాలసీహోల్డర్ కోటాలో షేర్లకు అప్లై చేయొచ్చు. పాలసీహోల్డర్లు గరిష్టంగా రూ.2,00,000 వరకే షేర్లకు దరఖాస్తు చేయొచ్చు. ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు 10 శాతం రిజర్వేషన్ ఉంది. 2022 ఫిబ్రవరి 28 లోగా ఎల్ఐసీ పాలసీ, పాన్ నెంబర్ లింక్ చేసినవారికే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. మెచ్యూరిటీ, సరెండర్, పాలసీదారుల మరణం కారణంగా ఎల్ఐసీ పాలసీ నిలిచిపోతే ఎల్ఐసీ పాలసీహోల్డర్ కోటా వర్తించదు. జాయింట్ అకౌంట్స్ ఉన్నవారు కూడా పాలసీహోల్డర్ కోటాకు అప్లై చేయొచ్చు. ఇద్దరు పాలసీహోల్డర్లలో ఎవరైనా ఒకరు రిజర్వేషన్ పొందొచ్చు. ఎన్ఆర్ఐ పాలసీహోల్డర్లకు పాలసీహోల్డర్ రిజర్వేషన్ వర్తించదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎల్ఐసీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుంది. మే 17న ఎల్ఐసీ ఐపీఓ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అవుతుంది. ఎల్ఐసీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.902 నుంచి రూ.949 మధ్య ఫిక్స్ చేశారు. ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు రూ.60 డిస్కౌంట్ లభిస్తుంది. ఎల్ఐసీ పాలసీహోల్డర్లు రూ.842 నుంచి రూ.889 మధ్య షేర్లకు అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)