1. భారతదేశంలోనే అతిపెద్ద ఐపీఓ ఇంకొన్ని రోజుల్లో రాబోతోంది. దిగ్గజ ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓ మే మొదటివారంలో రాబోతోంది. ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) గురించి ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎల్ఐసీ రూ.20,557 కోట్ల ఐపీఓతో రానుంది. భారతదేశంలో అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ ఐపీఓ రికార్డులు సృష్టించబోతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఎల్ఐసీ ఐపీఓకి అప్లై చేసేందుకు అనేకమంది ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం ఎల్ఐసీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం కోసమే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నవాళ్లు ఉన్నారు. మరి మీరు కూడా ఎల్ఐసీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కు చెందిన ఎస్బీఐ సెక్యూరిటీస్‌లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలని కోరుతోంది. కొన్ని ఆఫర్స్ కూడా ప్రకటించింది. ఎస్బీఐ సెక్యూరిటీస్ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్‌ను యోనో ప్లాట్ఫామ్లో ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఛార్జీలు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
4. అంతేకాదు... మొదటి ఏడాది డీపీ ఏఎంసీ ఛార్జీలను కూడా మాఫీ చేస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. నేరుగా ఎస్బీఐ సెక్యూరిటీస్ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు రూ.850 చెల్లించాలి. యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలు రూ.1,000 వరకు ఉంటాయి. యోనో ఎస్బీఐ ప్లాట్ఫామ్లో డీమ్యాట్ అకౌంట్ తెరిస్తే అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు, ఒక ఏడాది డీపీ ఏఎంసీ ఛార్జీలు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎస్బీఐ సెక్యూరిటీస్ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ముందుగా యోనో ఎస్బీఐ యాప్ లేదా వెబ్సైట్ ఓపెన్ చేయాలి. లాగిన్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి. మెనూ బార్లో ఇన్వెస్ట్మెంట్స్ సెక్షన్లోకి వెళ్లాలి. అందులో డీమ్యాట్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. అకౌంట్ హోల్డర్ పేరు, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇతర వివరాలు ఎంటర్ చేసి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎస్బీఐ సెక్యూరిటీ అప్లికేషన్ పరిశీలించి, అవసరమైన వెరిఫికేషన్ పూర్తి చేసి ఎస్బీఐ సెక్యూరిటీస్ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత షేర్స్ కొనొచ్చు. అమ్మొచ్చు. ట్రేడింగ్ చేయొచ్చు. ఐపీఓలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎస్బీఐ సెక్యూరిటీస్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎల్ఐసీ ఐపీఓకి అప్లై చేయొచ్చు. ప్రీ-ఆర్డర్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది ఎస్బీఐ సెక్యూరిటీస్. అంటే ఎల్ఐసీ ఐపీఓ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాకముందే ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చని ఎస్బీఐ సెక్యూరిటీస్ ట్వీట్ చేసింది. ప్రస్తుత ఎస్బీఐ సెక్యూరిటీస్ కస్టమర్లు మే 3 లోగా ఈ సదుపాయం ఉపయోగించుకోవాలని కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఎల్ఐసీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుంది. మే 17న ఎల్ఐసీ ఐపీఓ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అవుతుంది. ఎల్ఐసీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.902 నుంచి రూ.949 మధ్య ఫిక్స్ చేశారు. ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు రూ.60 డిస్కౌంట్ లభిస్తుంది. ఎల్ఐసీ పాలసీహోల్డర్లు రూ.842 నుంచి రూ.889 మధ్య షేర్లకు అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)