1. కొత్త సంవత్సరంలో ఇన్స్యూరెన్స్ తీసుకునేవారికి అలర్ట్. 2023 జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఏ రకమైన ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా, పాలసీదారులందరూ తప్పనిసరిగా నో యువర్ కస్టమర్ (KYC) వివరాలను అందించాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారతదేశంలో బీమాను కొనుగోలు చేసేవారందరికీ, సంస్థలకు ఈ రూల్స్ వర్తిస్తాయి. బీమా కంపెనీలు తమ పాలసీదారుల గురించి ఖచ్చితమైన వివరాలు, తాజా సమాచారాన్ని కలిగి ఉండాలన్నది ఐఆర్డీఏఐ ఉద్దేశం. KYC వివరాలను అందించడం ద్వారా మోసాలను, మనీ లాండరింగ్‌ను నిరోధించవచ్చని ఐఆర్డీఏఐ భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. అంతేకాదు, పాలసీదారులు తమ బీమా కవరేజీ ప్రయోజనాలు పూర్తిగా పొందేలా ఈ మార్పులు ఉపయోగపడతాయి. పాలసీదారులు తమ బీమా కవరేజీకి సంబంధించి జాప్యం జరగకుండా, సమస్యలు రాకుండా కేవైసీ వివరాలను ముందుగానే సబ్మిట్ చేయాలి. ప్రస్తుతం రూ. 1 లక్ష కంటే ఎక్కువ విలువైన క్లెయిమ్ చేసినప్పుడు మాత్రమే కేవైసీ పత్రాలు అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)
4. కొత్త నిబంధనల ప్రకారం, కొత్త పాలసీని కొనుగోలు చేసినప్పుడే కేవైసీ పత్రాలు సమర్పించడం అవసరం. పాలసీ తీసుకునేవారు కేవైసీ వివరాలను అందించడం అందిస్తే, వారి గుర్తింపును ధృవీకరించడం సులువవుతుంది. మోసాలు జరిగే అవకాశాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా జీవిత బీమా కొనుగోలు చేసేవారికి ఇది చాలా ముఖ్యం. (ప్రతీకాత్మక చిత్రం)
7. పాలసీదారులకు సమర్థవంతమైన, సురక్షితమైన ప్రక్రియను అందించడం ద్వారా, బీమా కంపెనీలు మెరుగైన సేవల ద్వారా కస్టమర్ల సంతృప్తిని పెంచవచ్చు. పాలసీదారులతో బలమైన సంబంధాలు ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి, ప్రస్తుత కస్టమర్లను నిలుపుకోవడానికి సాయపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)