1. గోవా మద్యంప్రియులకు మాత్రమే కాదు, హనీమూన్ జరుపుకునేవారికి ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్. నిత్యం వేలాది మంది పర్యాటకులు గోవాకు వెళ్తుంటారు. సెలవుల్లో గోవాకు వచ్చే పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని గోవా ప్రభుత్వం కొత్త రూల్స్ అమలు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. గోవాలో పర్యాటకులు ఎక్కడపడితే అక్కడ ఫోటోస్ క్లిక్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఇతర పర్యాటకుల ఫోటోలు కూడా క్లిక్ చేస్తుంటారు. ముఖ్యంగా ఫారిన్ నుంచి వచ్చే టూరిస్టుల ఫోటోలు క్లిక్ చేయడం మామూలే. పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని గోవా ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై ఇతరుల అనుమతి లేకుండా వారి ఫోటోలు క్లిక్ చేయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. కాబట్టి గోవా టూర్ వెళ్లేవారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. బీచ్లో తాము ఫోటోస్ దిగొచ్చు కానీ, ఇతరుల అనుమతి లేకుండా వారి ఫోటోస్ క్లిక్ చేయకూడదు. ముఖ్యంగా ఫారినర్స్ కనిపిస్తే వారి ఫోటోలు క్లిక్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. వారిలో సెల్ఫీలు దిగాలనుకుంటే అనుమతి తీసుకొని ఫోటోస్ దిగొచ్చు. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. బీచ్లో ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించకూడదు. వంటలు చేసుకోకూడదు. బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. లైసెన్స్ పొందిన రెస్టారెంట్లు, హోటళ్లలోనే మద్యం సేవించాలి. ఈ రూల్స్ పాటించకపోతే రూ.50,000 ఫైన్ చెల్లించాలి. ఇక పర్యాటకులు గోవాలో ట్యాక్సీ బుక్ చేసుకున్నప్పుడు మీటర్ ప్రకారమే డబ్బులు చెల్లించాలని గోవా టూరిజం చెబుతోంది. ప్రైవేట్ బైకులు, క్యాబ్స్, వాహనాలు అద్దెకు తీసుకోకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)