1. గతంలో ఉద్యోగులు పని చేసిన ప్రతీ చోటా కొత్త ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఓపెన్ చేసేవాళ్లు. కానీ ఆ తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO పాత పీఎఫ్ అకౌంట్‌ను కొత్త సంస్థలో కొనసాగించే అవకాశం కల్పించింది. అంటే ఓ ఉద్యోగి జాబ్ మానేసిన తర్వాత పాత యాజమాన్యం దగ్గర ఓపెన్ చేసిన ఈపీఎఫ్ అకౌంట్‌నే కొత్త యాజమాన్యం దగ్గర కొనసాగించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇందుకోసం ఈపీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పాత ఈపీఎఫ్ అకౌంట్ కంటిన్యూ అవుతుంది. కొత్త యాజమాన్యం జమ చేసే పీఎఫ్ డబ్బులు పాత అకౌంట్లోకి వెళ్తుంటాయి. ఈ విషయం తెలియక ఇప్పటికీ చాలామంది పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను అలాగే వదిలేసి కొత్త పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. మరి ఇలాంటి సందర్భంలో పాత ఈపీఎఫ్ అకౌంట్ ఏమవుతుంది? అందులో ఉన్న డబ్బుల పరిస్థితి ఏంటీ? డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా? వడ్డీ వస్తుందా లేదా? అన్న సందేహాలు ఈపీఎఫ్ ఖాతాదారుల్లో ఉన్నాయి. ఈపీఎఫ్ఓ అందించే బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో పొందాలంటే ఈపీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేయడమే మంచిదని చెబుతుంటారు ఫైనాన్షియల్ అడ్వైజర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
5. అంతేకాదు... పాత అకౌంట్లో ఉన్న డబ్బుల్ని కొత్త ఈపీఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. రెండు పీఎఫ్ అకౌంట్లు ఉంటే వాటిని మెర్జ్ చేయాలి. పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆపరేట్ చేయకుండా వదిలేస్తే ఇనాపరేటీవ్‌గా మారుతుంది. ఆ తర్వాత అందులోని డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ నుంచి ఐదేళ్ల లోపు డబ్బులు విత్‌డ్రా చేసినట్టైతే అంతవరకు వచ్చిన వడ్డీపై పన్నులు చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)