3. మొదట ఈ వడ్డీని రెండు విడతల్లో జమ చేస్తారన్న వార్తలొచ్చాయి. కానీ ఈక్విటీ మార్కెట్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడులకు భారీగా లాభాలు రావడంతో ఈపీఎఫ్ ఖాతాదారులకు వడ్డీని ఒకే విడతలో చెల్లించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించింది. ఈ మేరకు ఈపీఎఫ్ అకౌంట్లలో జనవరి 1 నుంచి వడ్డీ జమ చేస్తోంది ఈపీఎఫ్ఓ. (ప్రతీకాత్మక చిత్రం)
4. దీపావళి నాటికే ఈపీఎఫ్ వడ్డీ జమ అవుతుందన్న వార్తలొచ్చాయి. కానీ పలు కారణాల వల్ల వడ్డీ జమ చేయడం ఆలస్యమైంది. దీపావళి గిఫ్ట్ కాస్తా న్యూ ఇయర్ గిఫ్ట్‌గా మారింది. కాస్త ఆలస్యమైనా ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు ఇది తీపికబురే. కొత్త సంవత్సరంలో ఈపీఎఫ్ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్, ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఖాతాదారులు తమ ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. Missed Call: మిస్డ్ కాల్ ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ప్రత్యేకంగా ఓ ఫోన్ నెంబర్ కేటాయించింది. 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తాయి. అయితే ఇందుకోసం ఖాతాదారులు ముందుగా తమ మొబైల్ నెంబర్‌ను యూఏఎన్ అకౌంట్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. SMS: ఒక్క ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం సులువే. ఇందుకోసం కూడా ఈపీఎఫ్ఓ ప్రత్యేకంగా ఓ మొబైల్ నెంబర్ కేటాయించింది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్లో వస్తాయి. తెలుగులో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి EPFOHO UAN TEL అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. EPFO Portal: ఈపీఎఫ్ఓ వెబ్సైట్ https://www.epfindia.gov.in/ లో లాగిన్ అయి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత Our Services ట్యాబ్‌లో for employees సెలెక్ట్ చేయాలి. Services ఆప్షన్లో Member passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈపీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. UMANG App: భారత ప్రభుత్వానికి చెందిన ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం సులువే. ఉమాంగ్ యాప్ ఓపన్ చేసిన తర్వాత EPFO పైన క్లిక్ చేసి ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత View Passbook పైన క్లిక్ చేసి లాగిన్ కావాలి. పాస్‌బుక్ కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)